వైరల్: ఆ ప్రదేశంలో లభ్యమైన 1000 ఏళ్ల నాటి కోడి గుడ్డు..!

సాధారణంగా కోడి గుడ్లను ఫ్రిడ్జ్ లో భద్రపరిస్తే 3 నుంచి 5 వారాల వరకు పాడవకుండా ఉంటాయి.అదే ఫ్రీజర్ లో ఉంచితే ఒక సంవత్సరం వరకు గుడ్లు పాడు కావు.

 Viral 1000 Years Old Hen Egg Found In Israel  , 1000 Years, Egg, Found, Viral Ne-TeluguStop.com

కానీ అంతకు మించి ఎక్కువ కాలం గుడ్లను భద్రపరచడం అనేది దాదాపు అసాధ్యమే.కానీ ఒక కోడిగుడ్డు మాత్రం వెయ్యేళ్ళు దాటినా మురిగిపోలేదు.

ఇదేం విడ్డూరమని ఆశ్చర్యపోయారా…? కానీ ఇది అక్షరాల నిజం.ఐతే 1000 ఏళ్ల క్రితం కోడిగుడ్డు ఇప్పటికీ పాడవకుండా ఉందని తెలియడంతో.

ఇది ఎలా సాధ్యం అయ్యింది అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ ఈ అద్భుతమైన గుడ్డు ఎక్కడ లభించిందో వివరంగా తెలుసుకుంటే.

ఇటీవల ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారులు యావ్నే అనే ఒక నగరంలో తవ్వకాలు మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే వారికి వెయ్యేళ్ల నాటి ఓ కోడి గుడ్డు సెస్పిట్ లో కనిపించింది.

సెస్పిట్ అనగా మానవుల మలం స్టోర్ చేయడానికి తవ్విన ఒక గుంట.మనం దానిని లెట్రిన్ గుంట కూడా అని అంటాం.

అయితే ఈ ద్రవ మానవుల మలంలో భద్ర పరిచిన కోడి గుడ్డు 1000 ఏళ్ళ తర్వాత కూడా మురిగి పోకుండా ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మీడియాకి చెప్పుకొచ్చారు.

Telugu Israel, Hen Egg, Israel Egg, Septic Tank, Shocked, Meida, Latest-Latest N

అయితే 1000 ఏళ్ల నాటి ఈ కోడి గుడ్డు కింద భాగంలో పగుళ్ళు ఏర్పడ్డాయని దానివల్ల గుడ్డులోని సొన కిందకి కారిపోయిందని.కానీ పచ్చసొన మాత్రం గుడ్డు లోనే ఉందని.దాన్ని భద్రంగా సేకరించి డిఎన్ఎ విశ్లేషణ కోసం పంపించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అత్యంత జాగ్రత్తగా గుడ్డు ని సెస్పిట్ నుంచి తీసినప్పటికీ దాని పై పెంకు కొంచెం పగిలింది అని.కానీ ఒక లాబరేటరీ అధికారిణి గుడ్డు పెంకుని మళ్లీ సరి చేశారని శాస్త్రవేత్తలు చెప్పారు.

Telugu Israel, Hen Egg, Israel Egg, Septic Tank, Shocked, Meida, Latest-Latest N

దక్షిణ ఆసియా ఖండంలో 6000 సంవత్సరాల క్రితం నుంచే మానవులు కోళ్లను పెంచడం ప్రారంభించారు.కానీ చాలా సంవత్సరాల తర్వాత వాటిని తినడం ప్రారంభించారు.అయితే ప్రస్తుతం దొరికిన కోడిగుడ్డు ని భద్రపరచడానికి పూర్వీకులు కావాలనే సాఫ్ట్ మలంలో పెట్టి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అలాగే దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు.

అయితే ఇదే గుంట లో ఎముకలతో తయారు చేసిన బొమ్మలు కూడా కనిపించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube