విరాటపర్వం రిలీజ్ డేట్ ఫిక్స్... ఈ నెల ఆఖరులో

కెరియర్ ఆరంభం నుంచి భిన్న కథలతో సినిమాలు చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి రానా దగ్గుబాటి.కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా రానా తన మార్క్ చూపిస్తున్నాడు.

 Viraata Parvam Seals Its Release Date, Rana Daggubati, Sai Pallavi, Priyamani, V-TeluguStop.com

తెలుగు, హిందీ, తమిళ్ బాషలలో నటుడుగా తనదైన ముద్ర వేసుకున్నాడు.తాజాగా అరణ్య సినిమాతో రానా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఈ సినిమాలో అడవిలో ఏనుగులని సంరక్షించే వ్యక్తిగా, వాటి కోసం ఓ పొలిటికల్ లీడర్ తో ఎలా తలపడ్డాడు అనే అంశంతో తెరకెక్కింది.సినిమా కాన్సెప్ట్ బాగున్న నేరేషన్ లో లోపాలు వలన ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రానా హీరోగా తెరకెక్కిన మరో విభిన్న కథా చిత్రం ఈ నెలలో రిలీజ్ కి రెడీ అవుతుంది.వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ భాగానే ఆకట్టుకున్నాయి.సాయి పల్లవి పాయింట్ అఫ్ వ్యూ నుంచి ఈ సినిమా కథని దర్శకుడు చెబుతున్నట్లు టీజర్ బట్టి తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రానా నక్సల్ నాయకుడుగా కనిపిస్తూ ఉండగా సాయి పల్లవి అతనిని ప్రేమించే గిరిజన యువతి పాత్రలో దర్శనం ఇస్తుంది.ప్రియమణి సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుంది.

అలాగే నివేతా పేతురాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటించింది.ఎప్పుడో దశాబ్దం క్రితం ఒసేయ్ రాములమ్మ లాంటి చిత్రాలు అడవిలో ఉండే గిరిజన బ్రతుకులు, నక్సలైట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చాయి.

మళ్ళీ ఇప్పుడు వేణు ఊడుగుల అలాంటి కంటెంట్ ని టచ్ చేస్తున్నాడు.పీరియాడికల్ కాన్సెప్ట్ తో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథని చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఏప్రిల్ 30న సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ బాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube