ఉపాధి పేరిట చిత్రహింసలు: భారతీయ అమెరికన్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష

దేశం కాని దేశంలో ఉపాధి చూపిస్తానని నమ్మకంగా తీసుకెళ్లి పని పేరిట చిత్రహింసలకు గురిచేసిన ఓ భారతీయ అమెరికన్‌కు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.కాలిఫోర్నియాలోని స్టాక్టన్‌లో స్థిరపడిన సతీశ్ కార్టన్ శర్మిస్తా బారి దంపతులు ముగ్గురు భారతీయులను ఉపాధి కోసమని అమెరికాకు తీసుకొచ్చారు.

 violation Of Rights: Indian-american Convicted For Forced Labour Indian-america-TeluguStop.com

ఇంట్లో పనిచేయడానికి కార్మికుల కోసం యూఎస్‌లోని భారత సంబంధిత పత్రికలు, ఇంటర్నెట్‌లో మొదట ప్రకటన ఇచ్చిన దంపతులు… ఆ సమయంలో వేతనం, పని వేళల గురించి ఇచ్చిన షరతులను కూడా పాటించలేదు.

ప్రకటనలో ఇచ్చిన పని వేళలు కాకుండా రోజుకు 18 గంటలు పని చేయించుకున్నారు.

ఆ తర్వాత వేతనాలు అడిగిన కార్మికులపై బెదిరింపులకు పాల్పడ్డారు.ఒకవేళ ఎవరైనా కార్మికులు తాము వెళ్లిపోతామని చెబితే బారి దంపతులు వారిపై బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారు.

2014, ఫిబ్రవరి నుంచి 2016, అక్టోబర్ వరకు ఈ దంపతులు ఇలా బలవంతపు కార్మిక ఉల్లంఘనలకు పాల్పడ్డారు.

దీంతో ఈ దంపతులపై 2019లో కార్మిక ఉల్లంఘనలకు పాల్పడినందుకు కేసు నమోదైంది.బలవంతంగా కార్మికులను నియమించుకోవడం, వారిపై వేధింపులకు పాల్పడడం కింద బారి దంపతులపై నాలుగు ఆరోపణలు మోపబడ్డాయి.2019, మార్చి 14న తొలిసారి ఈ కేసు ఫెడరల్ కోర్టులో విచారణకు వచ్చింది.ఈ కేసులో శర్మిస్తా బారికి ఇప్పటికే 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.తాజాగా సతీశ్‌కు సైతం 15 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది.దీనితో పాటు ముగ్గురు బాధితులకు వేతనాలు, ఇతర పరిహారాల కింద 15,657 డాలర్లు ( భారత కరెన్సీలో రూ.11,53,000) నష్టపరిహారం చెల్లించాలని ఇక్కడి న్యాయశాఖ గురువారం అతడిని ఆదేశించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube