మరీ ఇంత కఠినమా: మళ్లీ మా దేశానికి రావొద్దు.. 10 మంది భారతీయుల్ని వెలివేసిన సింగపూర్  

Singapore Deports 10 Indians, Bars Re-Entry Over Violation Of Lock Down Norms, Lock Down Norms, Singapore,Indians - Telugu Bars Re-entry Over Violation Of Lock Down Norms, Indians, Lock Down Norms, Singapore, Singapore Deports 10 Indians

కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచం మొత్తం అల్లాడుతున్న సమయంలో దాని దూకుడుకు కళ్లెం వేసి శభాష్ అనిపించుకుంది సింగపూర్.చిన్న దేశమైనప్పటికీ పకడ్బందీ వ్యూహం, కఠిన వైఖరి ద్వారా మహమ్మారిని కంట్రోల్ చేయగలిగింది.

 Violation Lock Down Norms Singapore Indians

అయితే ఆ తర్వాత ఆంక్షలు సడలించడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది.దీంతో సింగపూర్ మళ్లీ ఆంక్షల కొరడా ఝుళిపించింది.

ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కరోనా నిబంధనల (సర్క్యూట్ బ్రేకర్)ను ఫాలో అవ్వాలని.అలా కాదని ఉల్లంఘిస్తే వారికి భారీ స్థాయిలో జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటోంది.

మరీ ఇంత కఠినమా: మళ్లీ మా దేశానికి రావొద్దు.. 10 మంది భారతీయుల్ని వెలివేసిన సింగపూర్-Telugu NRI-Telugu Tollywood Photo Image

తాజాగా రూల్స్ అతిక్రమించిన 10 మంది భారతీయులపై సింగపూర్ సర్కార్ వేటు వేసింది.వీరిని దేశం నుంచి బహిష్కరించినట్లు సోమవారం వెల్లడించింది.

వీరి పాసులను సైతం రద్దు చేశామని, ఈ పది మంది భవిష్యత్తులోనూ తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది.ఈ పది మంది భారతీయుల్లో ఉపాధి కోసం వచ్చిన వారితో పాటు విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం.

వీరంతా మే 5న ఓ ఇంటిలో గుంపులు గుంపులుగా గుమిగూడి కోవిడ్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను 2 వేల నుంచి 4,500 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా విధించారు.తాజాగా వారిని మరోసారి దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

అసలు సర్క్యూట్ బ్రేకర్ అంటే: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సింగపూర్ ఏప్రిల్ 7న ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది.దీని ప్రకారం అక్కడి ప్రజలు నిత్యావసరాలకు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

ఈ నిబంధన తొలి దశ జూన్ 2తో ముగిసింది.సోమవారం నుంచి రెండో దశ ప్రారంభంకాగా.

ఇందులో వ్యాపార సముదాయాలకు మరిన్ని సడలింపులు ఇచ్చింది.ఇప్పటి వరకు సింగపూర్‌లో 45,961 కేసులు నమోదవ్వగా.26 మంది మరణించారు.

#Singapore #Lock Down Norms #Indians

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Violation Lock Down Norms Singapore Indians Related Telugu News,Photos/Pics,Images..