వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ రేర్ స్టిల్.. ఈ స్టిల్ ఏ సినిమాలోదో తెలుసా!

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో క్లాస్ రోల్స్ కంటే మాస్ రోల్స్ లోనే ఎక్కువగా నటించడంతో పాటు తన నటనతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.యావరేజ్ కథలతో సైతం బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నారు.

 Vintage Ntr Photo Goes Viral In Social Media , Interesting Facts , Photo Goes Vi-TeluguStop.com

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన రేర్ స్టిల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ త్వరలో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు.

కలెక్షన్ల పరంగా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఆర్ఆర్ఆర్ మూవీతో నయా రికార్డులు క్రియేట్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు.నటుడిగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ఎన్నో విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జిమ్ లో వర్కౌట్స్ చేసే సమయంలో కుడిచేతి వేలికి గాయం కావడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంటికే పరిమితం కావడంతో పాటు రెస్ట్ తీసుకుంటున్నారు.అయితే #manofmassesntr అనే హ్యాష్ ట్యాగ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గడ్డిపై పడుకుని వయొలిన్, ల్యాప్ టాప్, గన్స్, బాంబ్ తో దిగిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వీవీ వినాయక్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Telugu Vintage Ntr-Movie

ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ కొత్తగా, యంగ్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.తారక్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో సైతం ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube