తన మనసు ముక్కలైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వినేశ్ ఫొగట్..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అందర్నీ నిరాశ పరిచింది.ఆమె ప్రదర్శన సరిగా లేకపోవడమే కాకుండా తన తొటి రెజ్లర్ తో ఆమె గొడవ పడింది.

 Vinesh Fogat Made Sensational Comments That His Mind Was Broken, Indian Wrestler-TeluguStop.com

దీంతో ఆమెను రెజ్లింగ్ సంఘం సస్పెండ్ చేసింది.ఆ సమయంలో ఆమె చాలా నిరాశలో మునిగిపోయింది.

ఇక తాను రెజ్లింగ్ ఆడలేనని కూడా ఓ రకంగా చెప్పేసింది.టోక్యో నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత ఆమె తీవ్ర అసహనంతో ఉంది.

నిరాశలో కూరుకుపోయింది.దీంతో ఆమె ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

భారతదేశంలో ఎంత బాగా ఎదిగితే అంత కిందికి దించుతారని వాపోయింది.తాను ఇప్పటి వరకూ ఓ మెడల్ కూడా సాధించలేదని, తన మనసు ముక్కలైపోయిందని తెలిపింది.

తన జీవితం ఇక ముగిసినట్లేనని తెలిపింది.తాను తిరిగి ఆటలో ఉంటానో లేనోనని బాధపడింది.

ఇకపై తనకు ఛాన్సు వచ్చే అవకాశం లేదని అనుమానం తెలిపింది.

Telugu Emotinal, Indian Wrestler, Tokyo Olym, Vinesh Phogat, Latest-Latest News

2017వ సంవత్సరంలో తన తలకు గాయం అయ్యింది.ఆ తర్వాత తన ఆట తీరు సరిగా లేదని వినేశ్ తెలిపింది.టోక్యో ఒలింపిక్స్ పోటీలకు ప్రిపేర్ అవుతున్న టైంలో రెండు సార్లు తనకు కరోనా వచ్చిందని తెలిపింది.

ఆ సమయంలో మానసికంగా చితికిపోయానని చెప్పుకొచ్చింది.టోక్యో ఒలింపిక్స్‌ లో గేమ్ లో వినేశ్ బెలారస్‌ కు చెందినటువంటి వెనెసా చేతితో ఘోరంగా ఓడిపోయింది.

వినేశ్ ఫొగట్ కోసం ఇండియా సర్కారు పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టింది.ఆమె ఆట తీరు మెరుగు పడటం కోసం విదేశాలలో కోచింగ్ ఇప్పించి ఎన్నో ఆశల మధ్య ఆమెను బరిలోకి దింపింది.

అయితే ఆమె మాత్రం తన అభిమానులకు, దేశానికి నిరాశ కలిగించింది.టోక్యోలో సాటి రెజ్లర్ తో ఆమె వాగ్వివాదానికి దిగడంతో ఆమెపై సస్పెన్స్ ఆర్డర్ వచ్చింది.

ఆమె ఇతరులతో ప్రాక్టీస్ చేయకుండా ఆపేసింది.అంతేకాకుండా ఆమెపై మరో ఆరోపణ కూడా ఉంది.

ఒలింపిక్స్‌ గేమ్స్ లో ఇండియా అథ్లెట్లకు స్పాన్సర్లు కిట్లను ఇస్తారు.వాటిని వాడకుండా తన సొంత బట్టలు ధరించి ప్రాక్టీస్ చేసినట్లుగా ఆమెపై ఆరోపణలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube