అమెరికాలో “ ట్రై స్టేట్ ” ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు..!!!

భారతీయులు జరుపుకునే అతి మఖ్య మైన పండుగలలో వినాయక చవితి ఒకటి.ప్రతీ ఏడాది భాద్రపదమాసం శుక్ల చతుర్ధి హస్తా నక్షత్రము రోజున వినాయక చవితి పండుగ మొదలవుతుంది.

 Vinayaksa Chavithi Celabration Start In America Try States, America, Vinayaka Ch-TeluguStop.com

ఎలాంటి శుభకార్యాలు తలపెట్టిన ముందు గణపతికి పూజలు చేసిన తరువాతనే పనులు ప్రారంభిస్తారు.భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఈ పండుగను జరుపుకుంటారు.

అలాగే వివిధ దేశాలలో స్థిరపడిన ఎన్నారైలు అందరూ కలిసి వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ముఖ్యంగా భారతీయులు అత్యధికంగా ఉండే అమెరికాలో వినాయక చవితి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి.

ప్రస్తుత కరోనా నేపధ్యంలో అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు ఆన్లైన్ లోనే పూజా కార్యక్రమాలని ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే

అమెరికాలో తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితమైన “ట్రై స్టేట్” తెలుగు అసోసియేషన్ వినాయక చవితి మహోత్సవాలని ఎంతో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

గతంలో తెలుగు సంస్థ సభ్యులు అందరూ కలిసి ఒకే చోట వినాయకుడిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు అయితే కరోనా నేపధ్యంలో వినాయక చవితి పూజా విధానం , సాంస్కృతిక కార్యక్రమాలని ఆన్లైన్ లోనే ఏర్పాటు చేశారు.అంతేకాదు.

Telugu Aditya Sharma, America, Indian, Pooja Festivals-Telugu NRI

ధారణా బ్రహ్మ రాక్షసుడిగా, అవధాన శారదా వంటి బిరుదులతో కనాకాభిషేకాలు, సువర్ణ కంకణాలు వంటి గౌరవాలు అందుకున్న తెలుగు రచయిత , అవధాని, ఉపన్యాసకుడు , తన ప్రవచనాలతో పెద్దలని, పిల్లలని ఎంతానో ఆకట్టుకుంటున్న గారిక పాటి నరసింహారావు గారిచే ప్రవచనాలు, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఆగస్టు 22 శనివారం ఉదయం 8:45 గంటలకు ఏర్పాటు చేశారు.ఆ తరువాత ఉదయం 10 గంటలకు కొమలపల్లి ఆదిత్య శర్మ గారిచే పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.

ఈ ఈవెంట్ రిజిస్ట్రేషన్ కొరకు – https://telugu.org/?event=ganesh-chaturdhi-utsav

ప్రవచనాలని,సాంస్కృతిక కార్యక్రమాలని వీక్షించడానికి https://tinyurl.com/y4rcmexy

మరిన్ని వివరాలకోసం : స్వప్నా పూల – (630)-902-6501, వేమూరి రవి – (847)-902-7476

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube