వినాయకుడు కుజునికి ఇచ్చిన వరం ఏమిటో తెలుసా!

Vinayaka Pooja Importance On Chaturthi, Vinayaka,Kuja Graha Dosham, Hindu Rituals, Kuja Graha Dosha Nivarana, Mangala Murthy

నవగ్రహాలలో ఒకటైన కుజ గ్రహాన్ని అంగారకుడు, మంగళుడు అని కూడా పిలుస్తారు.పురాణాల ప్రకారం కుజుడిని భూమి పుత్రుడు అని కూడా పిలుస్తారు.

 Vinayaka Pooja Importance On Chaturthi, Vinayaka,kuja Graha Dosham, Hindu Ritual-TeluguStop.com

ఒకసారి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకొని నర్మదా నది తీరంలో 1000 సంవత్సరాలు వినాయకుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు.ఆ విధంగా 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేయటంవల్ల కుజుడికి వినాయకుడు మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడు పది భుజాలు కలిగిన ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు.

ఆ విధంగా కుజుని తపస్సుకు మెచ్చిన వినాయకుడు కుజుడితో నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడగగా దానికి అంగారకుడు ఎంతో సంతోషించి వినాయకుని పూజిస్తాడు.అప్పుడు కుజుడు తనకు అమృతం కావాలని, అంతేకాకుండా తను ఎప్పుడు వినాయక నామస్మరణ చేస్తూ ఉండేలా వరం ఇవ్వవలసిందిగా కుజుడు వినాయకుని కోరుకుంటాడు.

అందుకు వినాయకుడు తధాస్తు నీ కోరిక నెరవేరుగాక అని చెబుతాడు.

Telugu Ganesha Gift, Hindu Rituals, Kujagraha, Mangala Murthy, Mars, Vinayaka, V

కుజుడు వినాయకుడి కోసం తపస్సు చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఉంటాడు.నీవు ఎరుపు రంగులో ఉన్నావు, ఎర్రని దుస్తులు ధరించావు, అంతే కాకుండా ఈరోజు మంగళవారం కనుక ఇప్పటినుంచి నీ పేరు మంగళుడు అనే నామకరణం చేసి వినాయకుడు మాయమవుతాడు.ఆ తర్వాత వినాయకుడు ప్రసాదించిన అమృతాన్ని సేవించి కుజుడు వినాయకుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు.

ఆలయంలో వినాయకుని ప్రతిష్టించి, ఆ వినాయకుడికి శ్రీ మంగళ మూర్తి అనే పేరు పెట్టాడు.ఇవే కాకుండా ఎవరైతే అంగారక చతుర్థి రోజు కఠిన ఉపవాస దీక్షలతో వినాయకుని పూజిస్తారో అలాంటి వారికి కుజ గ్రహ దోషాలు ఉండవు అనే వరాన్ని వినాయకుడు కుజునికి ప్రసాదిస్తాడు.

అందువల్ల కుజదోషం ఉన్నవారు చతుర్దశి రోజు వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube