సింగపూర్ లో వినాయక చవితి సంబరాలు..ప్రత్యేకత ఏమిటంటే..!!

భారతీయులు ఏ దేశంలో ఉన్నా భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలని ప్రతిభంబించే పండుగలను, ఆచారాల్ని పాటిస్తూనే ఉంటారు.ఎలాంటి పండుగలు వచ్చినా ఆయా దేశాలలో ఉండే భారతీయులు అందరూ ఒకే చోటుకి చేరుకొని సంబరాలు చేసుకుంటారు.

 Vinayaka Chaviti Celebrations In Singapore, Singapore, Singapore Telugu Samajam,-TeluguStop.com

అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని పండుగలను ఎవరికీ వారు ఇళ్లలోనే నిర్వహించుకోవడం జరిగింది.ఈ క్రమంలోనే భారతీయులు అందరూ ఎంతో ఇష్టంగా,మరెంతో వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితిని సింగపూర్ లో ఉన్న తెలుగు సమాజం ఎంతో వైభవంగా నిర్వహించింది.

కరోనా వైరస్ నిభందనలనువెబ్ నార్ ద్వారా నిర్వహించింది.ప్రతీ ఏడాది శివన్ టెంపుల్ నందు నిర్వహించే ఈ వేడుకలను ఈ సారి కూడా అక్కడే నిర్వహించారు.

జూమ్ యాప్ ద్వారా సింగపూర్ లో ఉన్న తెలుగు వారందరిని ఒకే చోట చేర్చి ఈ వేడుకలు ఏర్పాటు చేశారు.ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే.వెబ్ నార్ ద్వారా సుమారు 100 మంది బాలికలకు వారి వారి చేతుల మీదుగా పూజను జరిపించే అవకాశం కల్పించారు.ఈ ప్రయత్నం వారిని ఎంతో సంతోషపరిచిందని అంటున్నారు నిర్వాహకులు.

ఈ వేడులకను ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాట్లాడుతూ.సుమారు 300 మంది తెలుగు వారు ఈ వేడుకలను వెబ్ నార్ ద్వారా చూసే అవకాశం కలిపించామని అన్నారు.

పూజలో పాల్గొన్న సుమారు 100 మంది పిల్లలకి మట్టి వినాయకుడు, పూజ సామాగ్రి, అందించామని అన్నారు.ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతీ ఒక్క తెలుగు సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే వచ్చే ఏడాది అయినా అందరూ కలిసి సంతోషంగా మీ వేడుకలు చేసుకునే అవకాశం కల్పించమని గణపతిని కోరుకున్నామని నిర్వాహకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube