రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'వినయ విధేయ రామ' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!     2019-01-11   07:39:07  IST  Sai Mallula

రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతికి కానుకగా ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్ న్యూస్ సమీక్ష లో చూద్దాం.

Cast and Crew: న‌టీన‌టులు: రామ్ చరణ్ తేజ్, కైరా అద్వానీ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: బోయపాటి శీను
నిర్మాత‌: డీ.వి.వి. దానయ్య
సంగీతం:దేవిశ్రీప్రసాద్

Vinaya Vidheya Rama Movie Review-Ram Charan

Vinaya Vidheya Rama Movie Review

కథ :
నలుగురు అనాధల రోజువారీ కన్నీటి కష్టాలను చూపిస్తూ ఈ సినిమా మొదలవుతుంది. ఆ నలుగురు ఆనాధలు కలిసి మరొక అనాధని పెంచుకోవాలి అనుకుంటారు. ఆ బాలుడే పెద్దయ్యాక రామ్ చరణ్ తేజ్. చరణ్ కి తన అన్నలు అంటే ఎంతో ఇష్టం. రామ్ చరణ్ కి ఉన్న సోదరుల్లో ఒకరు ప్రశాంత్. అతను ఒక స్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. అన్న కోసం బాగా పలుకుబడి ఉన్న పందెం పరశురామ్ అనే వ్యక్తితో గొడవపడతాడు చరణ్.
ఇది ఇలా ఉండగా…చరణ్ కి ఓ పెళ్లి సంబంధం సెట్ అవుతుంది. కైరాను పెళ్లి చూపులు చూడటానికి వెళ్తాడు. ఆ ఇంట్లో కొద్దిగా కామెడీ సన్నివేశాలు. ఇంతలో ప్రశాంత్ కి బీహార్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. పందెం పరశురాంతో రామ్ కొణిదెలకి ఉన్న గొడవ పెద్దది అవుతుంది. అసలు రామ్ కొణిదెల ఎవరు అనే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ప్రశాంత్ ఇంకా అతని తమ్ముళ్లపై రివెంజ్ తీర్చుకోడానికి తెరపై ఎంటర్ అవుతారు వివేక్ ఓబ్రాయ్. తన సోదరులను రామ్ ఎలా కాపాడుకున్నాడో తెలియాలి అంటే సినిమా తెరపై చూడాల్సిందే.
నటీనటుల ప్రతిభ..
మెగా పవన్ స్టార్ రామ్ చరణ్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో చూపించారు బోయపాటి. ఉగ్రనరసింహుడి అవతారం ఎత్తి ‘రామ్.. కొ.. ణె.. దె.. ల’ అంటూ గర్జిస్తూ మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ మూవీ. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయంటున్నారు. రామ్ చరణ్ ఫైట్స్ ఇరగదీశాడని.. కైరా కాంబినేషన్‌లో స్టెప్పులు అదరగొట్టాడంటున్నారు. ప్రశాంత్ పాత్ర ఈ సినిమాకి ప్లస్ పాయింట్. వివేక్ ఓబ్రెయిని అనుకున్న విధంగా తెరకెక్కించలేకపోయారు.

Vinaya Vidheya Rama Movie Review-Ram Charan

టెక్నికల్ గా..
సినిమాటోగ్రఫీ పర్లేదు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
విశ్లేషణ :
ఈ చిత్రంలో నలుగురు వ్యక్తులు ఎలా కలిశారు. వారు ఎలా ఓ ఫ్యామిలీగా మారారు. వారు కలువడం వెనుక ఆసక్తికరమైన ట్విస్ట్ సినిమాకు ఆకర్షణ బీసీ సెంటర్లలలో వినయ విధేయ రాముడు కుమ్ముయడం ఖాయమే అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందని.. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ సీన్ చాలా ఉన్నాయంటున్నారు. బోయపాటి మార్క్ డైరెక్షన్ మూవీగా మంచి మసాలా అద్దారని.. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయంటున్నారు.
అజర్ బైజాన్లో‌ చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అనే ప్రచారం జరుగుతున్నది. మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలో ఈ సినిమా కోసం కష్టపడి షూట్ చేయడం జరిగింది. అజర్ బైజాన్ ఎపిసోడ్‌ను బోయపాటి అద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తున్నది.

Vinaya Vidheya Rama Movie Review-Ram Charan

ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
రామ్ చరణ్
ఆక్షన్ సన్నివేశాలు
ఫైట్స్
ఇంటర్వెల్ సీన్
డాన్స్
మైనస్ పాయింట్స్:
కథతో సంబంధంలేని కొన్ని ఫైట్ సీన్స్
దేవిశ్రీప్రసాద్ సంగీతం
సెకండ్ హాఫ్
స్టోరీ

తెలుగుస్టాప్ రేటింగ్ :3/5

బోటం లైన్ – “వినయ విధేయ రామ” – మాస్ ఆడియన్స్ కి నచ్చుతుంది…క్లాస్ ఆడియన్స్ కి నచ్చడం కష్టమే