‘వినయ విధేయ రామా’ సెన్సార్‌ పూర్తి... సెన్సార్‌ బోర్డ్‌ వారు ఏమన్నారంటే..!     2019-01-06   11:58:33  IST  Ramesh Palla

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబు అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్టు సమాచారం. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నీ ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకోగా ‘వివిఆర్‌’నే చివరగా ఈ తతంగంను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు యూ.ఎ సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. బోయపాటి సినిమా కాబట్టి కాస్త భారీ ఫైట్స్‌ ఉంటాయి. సో క్లీన్‌ యూ అనేది బోయపాటి చిత్రాలకు తగనిది అని చెప్పవచ్చు.

Vinaya Vidheya Rama Movie Censor Work Completed-Vinaya Vvr Release Date

Vinaya Vidheya Rama Movie Censor Work Completed

ఈ చిత్రానికి ఒక్క కట్‌ ఇవ్వకుండా సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు యూ.ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారట. సింగిల్‌ కట్‌ లేకపోవడంతో చిత్ర యూనిట్‌ కూడా ఖుషీగా ఫీల్‌ అవుతున్నారు. ‘వినయ విధేయ రామా’ చిత్రం చాలా బాగుందని, కచ్చితంగా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుందని, రామ్‌చరణ్‌ ఖాతాలో మరో మంచి హిట్‌ చేరుతుందని సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు అభిప్రాయాలు వెల్లడిరచారు. దాంతో ఈ చిత్రానికి ఇప్పటి నుండే పాజిటివ్‌ వైబ్స్‌ వస్తున్నాయి.

Vinaya Vidheya Rama Movie Censor Work Completed-Vinaya Vvr Release Date

‘రంగస్థలం’ చిత్రంతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న చెర్రీ ఈ చిత్రంతో కూడా భారీ హిట్‌ కొట్టాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. అందుకే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గోంటున్నాడు. పలు ఇంటర్య్వూలలో మాట్లాడుతూ సినిమాపై అంచనాలను అంతకంతకు పెంచుతున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వానీ రొమాన్స్‌ చేసింది. ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.