ఉరిశిక్ష వాయిదా కు మరో ఎత్తుగడ,నిర్భయ దోషి ఆత్మహత్యాయత్నం  

Nirbhaya Row Convict Vinay Sharma Tries To Hurt Self - Telugu Nirbhaya Patiyala Court, , Vinay Sharma, Vinay Sharma In Hospital, Vinay Sharma In Tihar Jail, Vinay Sharma Latest Update

2012 లో జేరఁగిన నిర్భయ ఘటనలో దోషులకు శిక్షలు ఖరారు చేస్తూ ఇటీవల కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో దోషులు అయిన నలుగురి ని మార్చి 3 న ఒకేసారి ఉరిశిక్ష వేయాలని ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పు వెల్లడించింది.

Nirbhaya Row Convict Vinay Sharma Tries To Hurt Self

అయితే ఈ శిక్షల నుంచి తప్పించుకోవడానికి తమదైన శైలి లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇప్పటికే వారికి ఉరిశిక్షలు అమలు చేయాలి అంటూ గతంలో రెండు సార్లు తీర్పు వెల్లడించిన కోర్టు దోషుల వరుస పిటీషన్ లతో ఇప్పటివరకు వారి ఉరిశిక్షలు అమలు కాలేదు.

అయితే తాజాగా మార్చి 3 న మరోసారి వారికి ఉరిశిక్షలు అమలు చేయాలి అంటూ తీర్పు వెల్లడించగా తాజాగా నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తీహార్ జైలు లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది.జైల్లోని గోడకు తలను దబా దబా కొట్టుకోవడంతో… అలర్టైన పోలీసులు అతన్ని ఆపి గాయాలపాలవ్వడం తో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినట్లు తెలుస్తుంది.

ఐతే.ఢిల్లీ నిర్భయ కేసులో వినయ్ శర్మ సహా నలుగురు దోషులకూ మార్చి 3న ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలని ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది.అయితే ఈ సమయంలో వినయ్ ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశ మైంది.మరోసారి శిక్షను తప్పించుకోవడానికి ఇలా ఎత్తుగడ వేసారా లేదంటే నిజంగా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాడా అన్న విషయం పై మాత్రం క్లారిటీ లేదు.

ఏదైనా కూడా ఈ కేసుకు సంబంధించి వారికి శిక్షలు అమలు కావలి అంటే తప్పనిసరిగా ఆ నలుగురికి ఒకేసారి ఉరిశిక్షలు అమలు కావలి ఉంటుంది.

ఒకవేళ ఎవరైనా అనారోగ్యం పాలైనా లేదా మరేదైనా కారణం చేత అయినా ఈ శిక్ష ను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మరి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు కారణం మాత్రం తెలియరాలేదు.అయితే జైలు అధికారులు మాత్రం ఈ విషయం పై స్పందించడానికి నిరాకరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు