తొలి ఫ్లయింగ్‌ కారు..ఇండియా నుంచే అక్కడికే..!

ప్రజలు భూమి మీద కంటే ఆకాశంలోనే ఎక్కువ తిరగాలనుకుంటారు.భూమి మీద తిరగలి అనుకునే ప్రజలు తగ్గిపోయి ఆకాశంలో ట్రాఫిక్ లేకుండా తిరగలి అనుకునే వారు పెరిగిపోతున్నారు.

 Vinata Company Is Soon Going To Launch Asias First Flying Car In India, Frist Fl-TeluguStop.com

అందుకే టెక్నాలజీ కూడా కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతుయింది.చిన్న ఆలోచన వచ్చిన సరే ఇంప్లీమెంట్ చేయాలని చూస్తుంది.

వారి ఆలోచనలకు పెట్టుబడులు పెట్టేవారు కూడా ముందుకొస్తున్నారు.దీంతో ఇండియాలో కొత్త ఆవిష్కరణలు వేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే కొన్ని ఆవిష్కారణలు ఆదర్శంగా నిలిచాయి.తాజాగా మరో ఆవిష్కరణ చేసేందుకు మన వాళ్ళు సిద్ధమయ్యారు.

మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్‌ కారును మార్కెట్‌లోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఇది ఆవిష్కరణ అయితే ఏషియాలో మిగిలిన దేశాలు మనవైపు చూడడం ఖాయం.

దీని ఆవిష్కారణ కోసం ప్రస్తుతం అందరు ఎదురుచూస్తున్నారు.వినత నుంచి మేకిన్‌ ఇండియా స్ఫూర్తితో ఇండియా ముందుకు దూసుకుపోతుంది.

స్టార్టప్‌లుగా మొదలైన కంపెనీలు ప్రస్తుతం యూనికార్న్‌లు మారుతున్నాయి.అయితే ఇప్పుడు మరో సంచలనం సృష్టించేందుకు ఇండియాకు చెందిన వినత స్టార్టప్‌ ప్రయత్నిస్తోంది.చెన్నైకి చెందిన వినత స్టార్టప్‌ రూపొందించిన ఫ్లైయింగ్‌ కారు కు సంబంధించిన ప్రోటోటైప్‌ను కేంద్ర ఏవియేషన్‌ మినిస్టర్‌ జ్యోతిరాదిత్య సింథియా పరిశీలించారు.పరిశీలించిన మంత్రికి కంపెనీ ప్రతినిధులు కారు గురించి పూర్తి వివరాలు ఇచ్చారు.

ఇది చూసిన వెంటనే మంత్రి మాట్లాడుతూ ఏషియా నుంచి తొలి ఫ్లైయింగ్‌ కారు మన దేశం నుంచి వచ్చే అవకాశం ఉందంటూ ప్రశంసించారు.ఈ కంపెనీతో పాటు కొరియాకు చెందిన హ్యుందాయ్‌ కంపెనీ కూడా ఈ కారు తయారు చేసే పనిలో ఉందని సమాచారం.

మరికొన్ని రోజుల్లో మరి కొన్ని కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Telugu Meters, Asias Car, India, India Car, Latest, India Concept, Vinata Compan

ఈ ఫ్లైయింగ్‌ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు.ఈ కారులో ఇద్దరు ప్రయాణించే విధంగా తయారు చేస్తున్నారు.గరిష్టంగా 1300ల కేజీల బరువును ఈ కారు మోసుకెళ్లగలదు.

గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు.గరిష్ట వేగం గంటలకు 120 కిలోమీటర్లు.

భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్‌ కారు ప్రయాణిస్తుంది.నిట్టనిలువుగా ల్యాండింగ్‌, టేకాఫ్‌ అవడం ఈ కారు ప్రత్యేకత అని అంటున్నారు.

ఈ కారులో బ్యాటరీతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను కూడా ఉపయోగిస్తారని తెలిపారు.ఈ కారుని ఇబ్బంది లేకుండానే ల్యాండ్‌ చేయోచ్చని వినత కంపెనీ చెబుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube