లాయర్ పాత్రలో కనిపించనున్న వెటరన్ హీరోయిన్... వర్కౌట్ అవుతుందా....?

తెలుగులో ప్రముఖ దర్శకుడు మార్తాండ కే శంకర్ మరియు యంగ్ హీరో వరుణ్ సందేశ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఎవరైనా ఎపుడైనా” చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళ బ్యూటీ విమలా రామన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు మొదటగా మలయాళ సినిమా పరిశ్రమలో నటిగా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.

 Vimala Raman Playing Lawyer Role In Malayalam Movies, Vimala Raman, Telugu Actre-TeluguStop.com

ఆ తర్వాత కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, భాషలలో కూడా తన నటనా ప్రతిభను నిరూపించుకుని తనకంటూ కొద్ది మంది అభిమానులను సంపాదించుకుంది.తెలుగులో నటి విమలా రామన్ ఎనిమిది పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జగపతి బాబు వరుణ్ సందేశ్, శ్రీకాంత్, అక్కినేని సుమంత్, అల్లరి నరేష్, శర్వానంద్, తదితర హీరోలతో కలిసి నటించింది.కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో విమల రామన్ కి టాలీవుడ్ లో సినిమా అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.దాంతో విమలా రామన్ సినిమాల పరంగా కొంత మేర బ్రేక్ తీసుకొని మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలతో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందులో విమలా రామన్ లాయర్ దుస్తులు ధరించి ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

దీన్ని బట్టి చూస్తే లాయర్ గా విమలా రామన్ తన తదుపరి చిత్రంలో ప్రేక్షకుల్ని అడ్వకేట్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా మీకెవరికైనా లాయర్ అవసరం ఉందా” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

దీంతో ఈ ఫోటోకి తెలుగు ప్రముఖ హీరోయిన్ ప్రియమణి స్పందిస్తూ నువ్వే నా లాయర్ అంటూ సరదాగా కామెంట్ చేసింది.దీంతో విమలా రామన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Malayalam, Priyamani, Telugu Actress, Tollywood, Vimala Raman, Vimalarama

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి విమలా రామన్ తెలుగు తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 25 కు పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కానీ కథల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఎక్కువ శాతం డిజాస్టర్లను ఎదుర్కొంది.దీంతో అన్ని ఉన్నప్పటికీ విమలా రామన్ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube