త్రివిక్రమ్ సినిమాలో విలన్స్ సచ్చిపోరండి.. మారిపోతారు.. అయన ప్లాన్ లే వేరు!

ఒక సినిమా అంటే ఆ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ కచ్చితంగా ఉంటారు.ఈ మూడు పాత్రలు ఉంటేనే అది సినిమాగా పరిగణించబడుతుంది.

 Villains Dont Die They Will Change In Director Trivikram Movies Details, Trivikr-TeluguStop.com

ఇక ఈ మూడు పాత్రలతోనే దర్శకులు రకరకాల కథలను రకరకాలుగా తీసి తెరకెక్కిస్తారు.ఏ సినిమాలోనైనా హీరో విలన్ ను చంపి హీరోయిన్ ను సొంతం చేసుకుంటాడు.

చాలా వరకి అన్ని సినిమాలలో సినిమా క్లైమాక్స్ లో హీరో విలన్ ని చంపుతాడు.దాంతో సినిమా పూర్తవుతుంది.ప్రతి ఒక్క దర్శకులు ఇటువంటి స్టైల్ ని ఫాలో అవుతారు.కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ అలా కాదు.

సినిమా విషయంలో ఆయన స్టైలే వేరు.అద్భుతమైన టచ్ తో సినిమాని పూర్తి చేస్తాడు.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదని చెప్పాలి.రైటర్ గా తెలుగులో అతి తక్కువ సమయం లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు.

తన కంటూ ఒక బ్రాండ్ నేమ్ సెట్ చేసుకున్నాడు.ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్ గా త్రివిక్రమ్ చరిత్ర సృష్టించారు.

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర స్టార్ డైరెక్టర్ల లో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.ఇక త్రివిక్రమ్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టీవ్ గా ఉంటాడు.

ఇక ఈయన సినిమా అంటే చాలు ప్రేక్షకులు పడి చస్తారు.ఎందుకంటే ఈయన సినిమాలుఅంతగా ఆకట్టుకుంటాయి కాబట్టి.

Telugu Agnatavasi, Trivikram, Jalsa, Khaleja, Tollywood, Villains Change-Movie

పైగా మంచి మంచి స్టోరీ తో అందులో మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.ఇక ఈయన సినిమాలలో విలన్స్ అసలు చచ్చిపోరు.కేవలం హీరోల డైలాగులతో విలన్స్ ఎమోషనల్ అవుతూ మారిపోతారు.అలా ఇప్పటికీ ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నింటిని ఒకసారి గమనించినట్లయితే ఆ సినిమాలలో విలన్స్ చాలా వరకు మారిపోతారు.

ఎవరు కూడా హీరో చేతిలో చనిపోరు.ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖలేజా, జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురంలో, అజ్ఞాతవాసి వంటి పలు సినిమాలు ఎంతటి సక్సెస్ అందుకున్నాయో చూసాం.

ఈ సినిమాలలో విలన్స్ చివరి వరకు హీరోతో పోటీ చేస్తూ కనిపిస్తారు.

Telugu Agnatavasi, Trivikram, Jalsa, Khaleja, Tollywood, Villains Change-Movie

నిజానికి త్రివిక్రమ్ సినిమాలో హీరోకి ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో విలన్ కు కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది.అందుకే త్రివిక్రమ్ విలన్ ను చంపకుండా చివరివరకు హీరో చేతిలో ఓడించడానికి కానీ లేదా హీరో కొట్టే డైలాగులతో విలను మార్చే విధంగా కానీ చేస్తాడు త్రివిక్రమ్.ఆ సమయంలో క్లైమాక్స్ మంచి టాక్ సొంతం చేసుకుంటుంది.

అలా త్రివిక్రమ్ సినిమాలలో ఎప్పుడైనా గమనించండి.కావాలంటే ఆయన చేసిన సినిమాలు ఒకసారి తిరిగి చూస్తే క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి.

ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలలో కూడా ఆయన ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందో చూద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube