ఆ హీరో నన్ను కావాలనే తొక్కేశాడంటున్న విలన్...  

Villain Vijaya Rangaraju Doing Sensational Comments On Mohan Lal-mohan Lal,mohan Lal Latest News,mohan Lal News,tollywood,vijaya Rangaraju,vijaya Rangaraju News,vijaya Rangaraju Sensational Comments On Mohan Lal

తెలుగులో పలు రకాల విభిన్న పాత్రల్లో నటిస్తూ తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టినటువంటి విజయ రంగరాజు గురించి చి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పనవసరం లేదు.ఈయన పేరు చెబితే తెలుగులో ముందుగా గుర్తొచ్చేది యజ్ఞం చిత్రం.

Villain Vijaya Rangaraju Doing Sensational Comments On Mohan Lal-Mohan Lal Mohan Latest News Tollywood Vijaya

ఈ చిత్రంలో హీరోగా గోపీచంద్ నటించగా విలన్ పాత్రలో విజయ రంగరాజు నటించాడు.అయితే తాజాగా విజయ రంగరాజు ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన సినీ ప్రస్థానంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి తన అభిమానులకి తెలిపారు.

తను అసలు పేరు విజయ రంగరాజు కాదని ఉదయ్ రాజ్ కుమార్  అని, అప్పటికే సినీ పరిశ్రమలో తన అసలు పేరుతో వేరే నటులు ఉండడంతో సినీ పరిశ్రమే తనకు ఈ విజయ రంగరాజు అని పేరు పెట్టిందని అన్నారు.

అలాగే తమిళ ప్రముఖ విలక్షణ నటుడు మోహన్ లా ల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ రంగరాజు.అయితే అప్పట్లో మోహన్ లాల్ నటించిన టువంటి ఓ చిత్రంలో తాను ప్రముఖ విలన్ గా నటించాలని కానీ ఆ చిత్రం వల్ల తనకు మంచి పేరు వచ్చిందని అందువల్ల మోహన్ లాల్ తన డైరీలో ఈ చిత్రం గురించి తప్పుగా రాసుకున్నట్లు తన సన్నిహితులు కొంతమంది తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు.

అంతేగాక మోహన్ లాల్ వల్ల పలు చిత్రాల్లో నటించే అవకాశం కోల్పోయానని,  ఒక రకంగా చెప్పాలంటే తనను సినీ పరిశ్రమలో ఎదగనివ్వకుండా మోహన్ లాల్ చేశాడని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

అయితే మరో సంఘటన కూడా తనను తీవ్రంగా కలచివేసిందని అన్నాడు.ఇంతకీ ఆ సంఘటన ఏమిటంటే తన పేరు చివరన ఉన్నటువంటి రాజు అనే పేరు చూసి తనను రాజులు కులం అనుకొని ఓ దర్శకుడు ఛాన్స్ ఇచ్చాడని, కానీ ఆ తర్వాత తాను రాజుల కులం చెందినవాడు కాదని తెలుసుకొని ఆ దర్శకుడు వచ్చి రంగరాజు తో మీరు రాజుల కులం చెందినట్లు అయితే మరికొన్ని అవకాశాలు ఇచ్చే వాడినని అన్నారట.దీంతో సినీ పరిశ్రమలో నటన గురించి ఆలోచించి అవకాశాలు ఇవ్వాలి కానీ కులాల పేరుతో అవకాశాలు ఇవ్వడం ఏంటని తనలో తానే కొంత కాలం మధన పడ్డానని చెప్పుకొచ్చారు రంగరాజు.

అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు. 

.

తాజా వార్తలు

Villain Vijaya Rangaraju Doing Sensational Comments On Mohan Lal-mohan Lal,mohan Lal Latest News,mohan Lal News,tollywood,vijaya Rangaraju,vijaya Rangaraju News,vijaya Rangaraju Sensational Comments On Mohan Lal Related....