రకుల్ సినిమా షూటింగ్‌లో రాళ్లదాడి.. పలువురికి గాయాలు..  

villagers pelt stones on rakul preet singh movie shooting,rakul preet singh,movie shooting,Attack,bollywood, john abraham, dhanipur, security guards, villagers, pelt stones - Telugu Attack, Bollywood, Dhanipur, John Abraham, Movie Shooting, Pelt Stones, Rakul Preet Singh, Security Guards, Villagers

రకుల్ ప్రీత్ సింగ్ లాక్ డౌన్ తర్వాత వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.రకుల్ నటించిన చెక్ సినిమా ఫిబ్రవరి 26 న విడుదల కానుంది.

TeluguStop.com - Villagers Pelt Stones On Rakul Preet Singh Movie Shooting

ఈ సినిమాలో రకుల్ లాయర్ పాత్రలో నటించింది.ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తుంది.

మొదట్లో స్టార్ హీరోలతో స్టెప్పులేసిన ఈ అమ్మడు ఇప్పుడు కుర్ర హీరోలతో ఆడిపాడబోతుంది.

TeluguStop.com - రకుల్ సినిమా షూటింగ్‌లో రాళ్లదాడి.. పలువురికి గాయాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ సినిమా ఎటాక్ లో నటిస్తుంది.

ఈ సినిమాలో జాన్ అబ్రహం తో రకుల్ నటిస్తుంది.లక్ష్యరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాను ఆగస్టు 13 న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదల చేయాలనీ నిర్మాతలు అనుకుంటున్నారు.అందుకే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిపి సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలనీ పట్టుదలతో ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ధనీపూర్ లో జరుగుతుంది.సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఎవ్వరూ ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది.దీంతో సెట్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Telugu Attack, Bollywood, Dhanipur, John Abraham, Movie Shooting, Pelt Stones, Rakul Preet Singh, Security Guards, Villagers-Movie

సినిమాలో భాగంగా బాంబు బ్లాస్టులు షూట్ చేస్తున్నారని బయటివారిని ఎవ్వరిని రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు.ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న స్థానికులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.అక్కడ గేట్ మూసివేసి ఉండడంతో గోడలపైకి ఎక్కి చూడడానికి ప్రయత్నిమ్చడంతో సెక్యూరిటీ వారికి స్థానికులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

దీంతో స్థానికులు సెక్యూరిటీ వాళ్లపై రాళ్ల దాడి చేసారు.

దీంతో చిత్ర యూనిట్ పోలీసులకు సమాచారం అందించింది.పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టడంతో గొడవ కాస్తా సద్దుమణిగింది.

ఈ ఘర్షణలో పలువురి సెక్యూరిటీ వాళ్లకు గాయాలయ్యాయి.ఈ ఘటనలో హీరో హీరోయిన్లకు ఎలాంటి గాయాలు జరుగలేదు.

దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

#John Abraham #Pelt Stones #Attack #Dhanipur #Villagers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు