రాజకీయ పార్టీలకు ఝలక్ ! సొంత మేనిఫెస్టో తో ఆ గ్రామస్థులు ...  

రాజకీయ నాయకులైన పార్టీలైన ఎన్నికల సమయంలోనే ప్రజల మాట వింటారు. ఎన్నికల అయిపోతే ఇక నాయకులు ప్రజలు జరగాలి తప్ప ప్రజలు చుట్టూ నాయకులు తిరగరు. ఎన్నికల్లో ఎక్కడలేని హామీలు ఇస్తూ ఎన్నికలు అయిపోయాక వాటి సంగతి మరిచి పోవడం రాజకీయ నాయకులకు అలవాటు. అయితే వరుసగా ఎలా మోసపోతున్న ఆ గ్రామస్తులు సొంతంగా డిమాండ్లతో కూడిన గ్రామ మేనిఫెస్టో నో ను సొంతంగా ఏర్పాటు చేసి ఊరి మధ్యలో అందరికీ కనిపించేలా ఏర్పాటు చేశారు.

Villagers Manifesto Nizamabad Distict-

Villagers Manifesto Nizamabad Distict

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో రాజకీయ నాయకులకు గ్రామస్తులు సవాల్ విసిరారు. కల్యాణ మండపం, సీసీ రోడ్లు, వ్యవసాయ రంగం, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన వసతులు, సౌకర్యాలు వంటి 14 అంశాలు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గ్రామస్తులు తయారు చేసుకున్న మేనిఫెస్టోను అమలు చేస్తామని హమీ ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు. మందు , మనీ వద్దు గ్రామాభివృద్ధే ముఖ్యమంటున్నారు. ఇదేదో బాగుంది కదా !