ఇలా కూడా లూటీ చేస్తారా! చెరువుపై చీమల దండులా పడిపోయారు  

Villagers Looted Fishing Lake In Suryapet District -

ఒకేసారి వందల మంది షాపుల మీద, లేదంటే ఇళ్ళ మీద పడిపోయి దోచుకుంటే దానిని లూటీ అంటారు.అలాంటి లూటీలు ప్రపంచ వ్యాప్తంగా చాలా చూసి ఉంటాం.

Villagers Looted Fishing Lake In Suryapet District

అయితే ఇప్పటి వరకు చూడనటువంటి ఓవెరైటీ లూటీ తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో జరిగింది.వందల సంఖ్యలో జనం ఒక్కసారిగా చెరువు మీద పది అందులో చేపలని లూటీ చేసేసారు.

వినడానికి కాస్తా వింతగానే అనిపించినా ఇది నిజం.హ్యాపీగా చేపలు కొనుక్కొని తినొచ్చు కదా అని అందరూ అనుకోవచ్చు కాని గ్రామస్తులు అలా చెరువుని లూటీ చేయడానికి కారణం ఉంది.

సూర్యాపేట జిల్లా గణపవరంలో 200 ఎకరాలలో చెరువు ఉంది.ఇది వేసవి కాలంతో చాలా వరకు ఇంకిపోయి ఉంది.ఈ చెరువులో రెండేళ్ళ నుంచి మత్ష్యకార సంఘాలు చేపలు పెంచుతూ, వేసవిలో పట్టి అమ్ముతూ ఉంటుంది.అయితే సడెన్ గా 10 గ్రామాలకి చెందిన రెండు వేల మంది ఒక్కసారిగా ఆ చెరువు మీద పడి లూటీ చేసేసారు.

దీనికి కారణం మత్ష్య కార సంఘాలు ఆ చేరులో పట్టే చేపలు స్థానికంగా అమ్మకుండా రాత్రి సమయాలలో పట్టి ఇతర ప్రాంతాలకి తరలిస్తున్నారు.దీంతో ఆవేశంతో ఒక్కసారిగా ఆ చుట్టూ గ్రామాల వారు చెరువుని లూటీ చేసి చేపలు పట్టేసుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Villagers Looted Fishing Lake In Suryapet District- Related....