రెండు వేల ఏళ్ల నాటి నాణేలు.. ఇప్పుడు అక్కడ బయటపడ్డాయ్!

సాధారణంగా ఏవైనా తవ్వకాలు చేపట్టినప్పుడు ఆ తవ్వకాలలో కొన్ని పురాతనమైన వస్తువులు బయట పడుతూ ఉండటం మనం వినే వుంటాం.అలాంటి తవ్వకాలలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి వస్తువులు తవ్వకాలలో బయట పడుతుంటాయి.

 Villagers Find 2000-year-old Coins In Up, Uttar Pradesh, Mohammadabad Gohna Tehs-TeluguStop.com

అలా బయట పడిన వాటిని పురావస్తు శాఖ అధికారులు సొంతం చేసుకొని వాటిపై పరిశోధనలను కొనసాగిస్తుంటారు.తాజాగా ఇలాంటి తవ్వకాలలో 2000 సంవత్సరాల కాలం నాటి నాణేలు బయటపడిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని మహమ్మదాబాద్ ఘోహ్నా తెహసిల్ ఈ క్రమంలో రెండువేల సంవత్సరాల నాటి అతి పురాతనమైన 128 నాణేలు లభ్యమయ్యాయి.ఈ నాణేలు అన్ని దాదాపు 1500 నుంచి 2000 వేల సంవత్సరాల కాలం నాటివి అయ్యి ఉండవచ్చని జిల్లా మెజిస్ట్రేట్ అమిత్ కుమార్ బన్సాల్ తెలిపారు.

అయితే ఈ నాణేలు అన్నింటిని ఒక కుండలో లభించినట్లు అధికారులు తెలిపారు.ఈ నాణాలు బయటపడటంతో వెంటనే ఆ సమాచారాన్ని పురావస్తు శాఖ అధికారులకు తెలియజేచేశారు.

Telugu Coins, Uttar Pradesh, Villagersfind-Latest News - Telugu

ఈ విషయం తెలుసుకున్న ఆర్కియాలజికల్ డైరెక్టరేట్ ఆ ప్రాంతాన్ని వారి స్వాధీనం చేసుకున్నారు.పురావస్తు శాఖ అధికారులు ఈ నాణేలు పరిశీలించి వీటిలో బంగారునాణేలతో పాటు వివిధ లోహాలతో తయారైన నాణేలు ఉన్నాయని ఆర్కియాలజికల్ అధికారులు గుర్తించారు .ఈ నాణేలను స్వాధీనం చేసుకున్న పురావస్తుశాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాలలో ప్రజలు ఎవరూ తవ్వకాలు చేపట్టకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఇలాంటి నాణేలు కొద్ది రోజుల క్రితం ఇజ్రాయిల్ లో కొంతమంది యువకులకు మట్టి కుండలో కొన్నివేల బంగారు నాణేలు దొరికినట్లు సమాచారం.

అయితే ఆ నాణేలు కూడా కొన్ని వేల సంవత్సరాల నాటివని తెలుస్తోంది.అయితే అవి ఏ కాలానికి సంబంధించినవో ఇంకా తెలియాల్సి ఉందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube