చేతబడి చేస్తున్నారని గ్రామస్థులు ఏం చేసారో తెలుసా..?  

Villagers Couple Black Magic - Telugu Black Magic, Murder, Villagers, Villagers Killed Husband And Wife Due To Block Magic

రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతుంది.మనుషుల్లో కూడా ఎంతో మార్పు వస్తుంది.

 Villagers Couple Black Magic

కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు.మూఢ నమ్మకాల నెపంతో మనుషులను కిరాతకంగా హత్య చేసిన సంఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉంది.

తాజాగా మరోసారి ఇలాంటి దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

చేతబడి చేస్తున్నారని గ్రామస్థులు ఏం చేసారో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

చేతబడి చేస్తున్నారు అనే నెపంతో భార్యాభర్తలను గ్రామస్తులు అందరూ కలిసి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు.

దుర్ఘటన ఒడిషాలోని మల్కాన్గిరి సమితిలోని ఫెండ్రగూడా గ్రామంలో చోటు చేసుకుంది.పెండ్రగూడా గ్రామంలో కొన్నాళ్ల నుంచి చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోతున్నారు.అయితే తమ పిల్లలు చనిపోవడానికి కారణం అదే గ్రామంలోని భార్యాభర్తలు అయినా సోమ మాఢీ, శుక్ర మాఢీ అని గ్రామస్తులు అనుమానించారు.

ఆ భార్య భర్తలు చేతబడి చేసి తమ పిల్లలను అనారోగ్యానికి గురయ్యేలా చేసి చంపారు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.

మరింత మంది పిల్లలు చనిపోకుండా ఉండాలంటే వారిని అంతం చేయడం ఒక్కటే దారి అని అనుకున్నారు.దీంతో అనుకున్నదే తడవుగా… రాత్రి సమయంలో ఆ భార్య భర్తలు నిద్రిస్తున్న సమయంలో వారిపై గొడ్డలితో దాడికి తెగబడ్డారు గ్రామస్తులు.

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test