జగన్ కి ఊహించని షాక్ ఇచ్చిన గ్రామ వాలంటీర్లు..!! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ పదవి చేపట్టిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావటం జరిగింది.వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ పనులు నేరుగా ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యే రీతిలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఈ గ్రామ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ వారధిగా ఉండే రీతిలో జగన్ ఆలోచన చేయడం అందరికీ తెలిసిందే.

 Ys Jagan, Grama Volunteers,vijaywada,andhra Pradesh, Ap Village Volunteers Deman-TeluguStop.com

సరిగ్గా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 15వ తారీకు ప్రారంభించిన జగన్ .వాలంటీర్లకు ఐదు వేల రూపాయల వేతనాన్ని అందిస్తున్నారు.అయితే పని ఒత్తిడి కారణంగా తాజాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వాలంటీర్లు వేతనాన్ని 12,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు.తాజాగా విజయవాడ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున గ్రామ వాలంటీర్లు.

రోడ్డుపైకి రావడంతో పోలీసులకు వాళ్ళకి మధ్య తోపులాట జరిగింది.ఈ క్రమంలో ఉద్యోగ భద్రత కల్పించి వేతనాన్ని పెంచి, పని ఒత్తిడి తగ్గించి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాలంటీర్లు రోడ్డుపైకి రావడంతో జగన్ సర్కార్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది అనే టాక్ ఏపీ మీడియా సర్కిల్స్ లో వినబడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube