ప్రేమ పేరుతో గ్రామ వలంటీర్ దారుణం..!

మాయ మాటలతో అమ్మాయిని నమ్మించి లోబర్చుకొని గర్భవతి చేసి మొహం చాటేశాడు ఓ గ్రామ వాలంటీర్.ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

 Love, Cheatting, Police, Ananthapuram-TeluguStop.com

అనంతపురం జిల్లాలోని శింగనమల మండలం నాగులగుడ్డం తండాకు చెందిన గ్రామ వలంటీర్‌ కు కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన యువతితో పరిచయమైంది.యువతీ కుటుంబ సభ్యులు జీవనోపాధి కోసం అనంతపురం జిల్లాకు వలస వెళ్లారు.

అనంతపురంలో యువతి తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.వరలక్ష్మీబాయి ఇంటర్‌ చదువుతోంది.

అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది.

గతేడాది తన సోదరుడికి చికిత్స చేయించేందుకు కిరణ్ నాయక్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో యువతితో కిరణ్‌కి పరిచయం ఏర్పడింది.వారి పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది.

అతను యువతిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు.తీరా ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది.

వెంటనే యువతి తల్లిదండ్రులు కిరణ్ పేరెంట్స్‌ని సంప్రదించడంతో పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు.

కొద్దీ రోజులు గడిచిన తర్వాత కిరణ్ యువతిని దూరం పెడుతూ ఆమెతో సంబంధం లేనట్టు వ్యవహరించడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు.కిరణ్ కుటుంబ సభ్యులు పెళ్ళికి కొద్దీ సమయం కావాలని అడగడంతో యువతి కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు.

గడువు ముగిసే రోజు వచ్చాక మళ్లీ అడ్డం తిరిగాడు గ్రామ వలంటీర్. బంధువులతో కలసి ఏకంగా యువతి కుటుంబంపై సభ్యులపై దాడి చేసేందుకు యత్నించాడు.

దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తన కూతురిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని.

పెళ్లి చేసుకుంటానని పిలిపించి తమపై దాడి చేశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube