కలిచి వేస్తున్న గ్రామ కార్యదర్శి మరణం.. ఏపీలో హృదయవిదారక ఘటన.. !

ప్రస్తుతం కరోనా వల్ల చోటు చేసుకుంటున్న మరణాలను చూసుంటే మనిషి జీవితం ఎంత అల్పమైనదో అనిపిస్తుంది.అహాంకారంతో మిడిసిపడుతున్న మనిషి బ్రతుకు నీటి బుడగకంటే దారుణంగా మారింది.

 Village Secretary Death Heartbreaking Incident In Ap-TeluguStop.com

ఇన్నాళ్లూ హోదా కోసం, సంపాదన కోసం పరిగెత్తిన మానవుడు ఇప్పుడు బ్రతకడం కోసం పరుగులు తీస్తున్నాడు.

అలసిపోయే వరకు, ఊపిరి ఆగిపోయే వరకు ఇలాగే పరిగెత్తని.

 Village Secretary Death Heartbreaking Incident In Ap-కలిచి వేస్తున్న గ్రామ కార్యదర్శి మరణం.. ఏపీలో హృదయవిదారక ఘటన.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే ఇలాంటి విపత్తులు ఎన్ని ఎదురైన మనిషి అనే రెండు కాళ్ల ప్రాణిలో మార్పు, మానవత్వం వికసించవు, అహంకారం అణిగిపోదు.ఈ జగన్నాటకంలో ప్రతి వారు పావులే అన్న నిజాన్ని గ్రహించిన రోజున మాత్రమే ప్రకృతి సహకరించడం మొదలు పెడుతుంది.

సమానత్వం సిద్దిస్తుంది.

ఇకపోతే ఈ కరోనా వల్ల ఎన్నడు చూడలేని చావులు కళ్లముందు మెదులుతున్నాయి.

తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.గండేపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జయశంకర్ నారాయణ అనే వ్యక్తి పంచాయతీ కార్యాలయంలోని కుర్చీలో కూర్చున్న సమయంలోనే మృత్యువు వరించగా ప్రాణాలు వదిలాడు.

కాగా గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నారాయణ అలాగే విధులు నిర్వహిస్తూ మరణించాడట.ఇకపోతే మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యిందట.

చూశారా కరోనా వల్ల హృదయాన్ని ద్రవింపచేసే ఇలాంటి ఘటనలు లోకంలో ఎన్నో చోటుచేసుకుండటం.అందుకే ప్రాణాలంటే తేలికగా తీసిపారేయకండి.

పోయాక ఎలాగో దాని విలువ తెలిసిన బ్రతకలేమని గుర్తుంచుకోండి.

#Death #Gandepalli #Mallepally

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు