గ్రామ సచివాలయాల పార్టీ రంగులు మార్చాల్సిందే... హైకోర్టు ఆదేశాలు

ఈ మధ్య కాలంలో ఎ పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ కార్యాలయాలకి ఆ పార్టీకి సంబందించిన రంగులు వేసుకోవడం భాగా అలవాటైపోయింది.తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారం మరింత శ్రుతిమించింది.

 Village Secretaries Color Ys Jagan-TeluguStop.com

ప్రభుత్వ స్కూల్స్ కి, కొత్తగా కడుతున్న గ్రామ, పట్టణ సచివాలయాలకి, పాత ప్రభుత్వ భవనాలకి కూడా వైసీపీ పార్టీ జెండా రంగులు వేసేశారు.ఈ రంగుల వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి.

కొన్ని చోట్ల జాతీయ జెండాని కూడా మార్చేసి వైసీపీ రంగులు వేసేశారు.ఈ ఘటన ఎంత వివాదాస్పదంగా మారిందో అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ రంగుల వ్యవహారం ఇప్పుడు హైకోర్టు పరిధిలోకి వెళ్ళింది.గుంటూరు జిల్లా పల్లపాడులో ఓ ప్రభుత్వ స్కూల్ కి వైసీపీ రంగులు వేయడంపై ఆ గ్రామ ప్రజలు హైకోర్టుని ఆశ్రయించారు.

ఈ కేసుని పరిగణంలోకి తీసుకొని విచారించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి మొట్టికాయలు పెట్టింది.ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు ఉండకూడదని తీర్పు చెప్పింది.దీనిపై ఎన్నికల సంఘం బాద్యత తీసుకొని కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది.అలాగే ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి వేసిన వైసీపీ రంగులని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ప్రభుత్వ స్కూల్స్, కార్యాలయాలకి వైసీపీ రంగులు వేయడం కోసం ప్రభుత్వం ఖజానా నుంచి వంద కోట్లకి పైగా ఖర్చు చేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎన్నికల సంఘం కలుగజేసుకొని పార్టీ రంగులు తొలగించమంటే ఇంత వరకు ఖర్చు పెట్టిన సొమ్ము వృధా కావడంతో ఇప్పుడు కొత్తగా మరల రంగులు వేయడానికి మరిన్ని కోట్లు వృధా అవుతుందో తెలియాలి.

అయితే ఈ ప్రభుత్వ డబ్బుని వృద్ధా వృధా చేయడంపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube