దేశానికే ఆదర్శం : ఆ గ్రామంలో అమ్మాయి పుడితే ఏం చేస్తారో తెలుసా, మరి మనం ఎందుకు ఇలా?  

Village In Rajasthan Plants 111 Trees For Every Girl Child Born Is Great Thing - Telugu Filmpati Village, Mango Trees And Other Plants, Village In Rajasthan,

ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో అమ్మాయిల కంటే అబ్బాయిలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు.అబ్బాయిలు పుట్టలేదని బాధ పడే వారు ఎక్కువ మంది ఉంటున్నారు.

Village In Rajasthan Plants 111 Trees For Every Girl Child Born Is Great Thing

అమ్మాయి పుట్టిన సమయంలో కన్నీరు పెట్టుకున్న తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు.అమ్మాయి పుట్టుకను కడుపులో ఉండగానే నిర్ధారించి చిదిమేస్తున్న రోజులు ఇవి.అత్యంత దారుణమైన పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి.ముఖ్యంగా ఈ పరిస్థితి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉందని ఒక సర్వేలో వెళ్లడయ్యింది.

కాని అదే ఉత్తర భారతంలోని రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో అమ్మాయి పుడితే ఏం చేస్తున్నారో తెలిస్తే దేశం మొత్తం ఆశ్చర్యపోవాల్సిందే.

దేశానికే ఆదర్శం : ఆ గ్రామంలో అమ్మాయి పుడితే ఏం చేస్తారో తెలుసా, మరి మనం ఎందుకు ఇలా-General-Telugu-Telugu Tollywood Photo Image

 రాజస్థాన్‌లోని రాజ్సమండ్‌ జిల్లాలో ప్లిపాంట్రి అనే చిన్న గ్రామం ఉంది.ఆ గ్రామంలో అమ్మాయి పుడితే ఆందోళన చెందాల్సిన పనే లేదు.ఆ ఊర్లో అమ్మాయి పుట్టింది అంటే అదో సందడి మొదలవుతుంది.

అమ్మాయి పుట్టిన రోజు నుండి దాదాపు నెల రోజుల పాటు ఆ హడావుడి కొనసాగుతుంది.ఊర్లో ఒకరకమైన పండగ వాతావరణం ఉంటుంది.

ఆ అమ్మాయి గురించిన ఆలోచనలు, ఆ పాప భవిష్యత్తు గురించి పుట్టిన వెంటనే చర్చ మొదలు అవుతూనే ఉంటుంది.ఆ అమ్మాయి పెరిగి పెదయ్యాక ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు పుట్టిన నెల రోజుల్లోనే చర్యలు తీసుకుంటారు.

 ఆ గ్రామంలో ఒక అమ్మాయి పుట్టింది అనగానే వెంటనే గ్రామస్తులు అంతా కలిసి కనీసం 111 చెట్లు పెడతారు.వేప, ఉసిరి, మామిడితో పాటు ఇంకా ఆదాయం ఇచ్చే పలు చెట్లను పెడతారు.చెట్టు పెట్టిన సమయంలోనే ఆ చెట్ల నుండి వచ్చే ఆదాయం ఆ అమ్మాయికే అంటూ వీలునామా కూడా రాసి, ఆ చెట్లకు ప్రత్యేకంగా గుర్తింపును పెడతారు.చెట్లు పెట్టడం మాత్రమే కాకుండా చెట్లను సంరక్షించేందుకు కూడా ఆ సమయంలోనే కొందరిని నియమించడం జరుగుతుంది.

వారు ఆ చెట్ల సంరక్షణ బాధ్యత తీసుకుంటారు.

కేవలం చెట్లు పెట్టడం మాత్రమే కాకుండా అమ్మాయి పుట్టిన వెంటనే గ్రామస్తులు అంతా కలిసి విరాళంగా రూ.21 వేలు సేకరిస్తారు.అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రుల నుండి రూ.10 వేలు తీసుకుంటారు.మొత్తం రూ.31 వేలను ఆ అమ్మాయి పేరుపై బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం జరుగుతుంది.అమ్మాయి పెద్దయ్యాక అవసరాల కోసం తీసుకోవడంకు మాత్రం ఆ డబ్బు వస్తుంది.

చదువు లేదా పెళ్లికి మాత్రమే ఆ డబ్బు వినియోగించాల్సి ఉంటుంది.

 సదరు గ్రామంలో 2006వ సంవత్సరం నుండి ఈ పద్దతి కొనసాగుతుంది.ఎంతో మంది అమ్మాయిల కోసం ఈ గ్రామంలో కొన్ని వేల చెట్లు పెంపకం జరుగుతుంది.ఆ అమ్మాయిలకు ఉపయోగదాయకం అవ్వడంతో పాటు పచ్చదనం మరియు అహ్లాదకరమైన వాతావరణం కూడా ఆగ్రామంలో కనిపిస్తుంది.

దేశ వ్యాప్తంగా గ్రామాల్లో ఇలా ఎందుకు చేయకూడదు.ఆ గ్రామస్తులు చేస్తున్నట్లుగా మనం ఎందుకు చేయలేక పోతున్నాం.

మనం మాత్రమే అమ్మాయిల విషయంలో ఎందుకు తేడాగా ఆలోచిస్తున్నాం అనే విషయాలను ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచించుకోవాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Village In Rajasthan Plants 111 Trees For Every Girl Child Born Is Great Thing-mango Trees And Other Plants,village In Rajasthan Related....