అదొక వింత గ్రామం... అంద‌రిళ్ల‌లో వండేది మ‌గ‌వారే... 500 ఏళ్ల ఆచారం

సాధార‌ణంగా వంటగది అనేది మహిళల ప్ర‌పంచం.ఇక్కడ వారి ఆధిపత్యం కొన‌సాగుతుంద‌ని వింటూ ఉంటారు.

 Village In Pudducherry Village Of Cooks Details, Village Of Cooks, Puducherry, M-TeluguStop.com

అయితే పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో గత కొన్నేళ్లుగా ఓ వింత ఆచారం కొన‌సాగుతోంది.ఇక్కడ వంటగది బాధ్యత 500 సంవత్సరాలుగా పురుషులదే.

గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక మగ వంటవాడు ఉంటాడు.ఈ సంప్రదాయం గత 5 శతాబ్దాలుగా కొనసాగుతోంది.

కలయూర్ గ్రామం పుదుచ్చేరి నుండి 30 కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ ప్రతి ఇంట్లో మగ వంటవాడు కనిపిస్తాడు.ఈ గ్రామాన్ని వంటకుల గ్రామం అని కూడా అంటారు.ఈ గ్రామంలో దాదాపు 80 ఇళ్లు ఉండగా, ప్రతి ఇంట్లో మగ వంట మనిషి ఉండడం ఆనవాయితీ.

ఈ సంప్రదాయం కూడా ఈనాటిది కాదు, 500 ఏళ్లుగా కొనసాగుతోంది.

ఒక అంచనా ప్రకారం గ్రామంలో 200 మంది మగ వంటవారు ఉన్నారు.గ్రామంలోని పురుషులు ఉత్తమ కుక్‌లుగా మారడానికి 10 సంవత్సరాల సుదీర్ఘ శిక్షణ తీసుకోవాలి.

ఈ వంటవాళ్లంతా పెళ్లిళ్లు, పార్టీల్లో ఫుడ్ ఆర్డర్ కూడా తీసుకుంటారు.ఇక్కడ వంట చేసేవారు ఒకేసారి 1000 మందికి ఆహారం అందించగలరు.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భోజనానికి వచ్చినప్పుడు ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది.నాటి రోజుల్లో వ్యవసాయ పనులు చాలా కష్టతరంగా ఉండేవని, ఎవ‌రికీ ఉద్యోగం దొరకడం లేదని, అలాంటి పరిస్థితుల్లో వంట మనిషిగా మారడమే మంచిదని గ్రామంలోని మగవాళ్లు భావించార‌ట‌.

Kalayur village in Puducherry Village of Cooks Viral

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube