ఇండియన్ టాప్ స్టార్స్.. ప్రభాస్ సినిమాల్లో విలన్స్..

Vilains In Hero Prabhas Movies

ప్రభాస్. బాహుబలి సినిమా పుణ్యమా అని ఇండియాలో ఏ హీరోకు అందనంత ఎత్తుకు ఎదిగాడు.ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు.వరుస బెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ దుమ్మురేపుతున్నాడు.రోజు రోజుకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు.అత్యంత భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరల్డ్ రేంజ్ హీరోగా మారిపోయాడు.

 Vilains In Hero Prabhas Movies-TeluguStop.com

అయితే ప్రభాస్ సినిమాలో విలన్ పాత్రలపై ఫిల్మ్ మేకర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఆయనతో ప్రతినాయకుడిగా నటించాలంటే ఆయన స్థాయి ఉన్న నటులు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నారు.

అందుకే ప్రభాస్ మూవీ విలన్స్ ను ఎంచుకునే పనిలో బిజీ అయ్యారు పలువురు దర్శకనిర్మాతలు.

 Vilains In Hero Prabhas Movies-ఇండియన్ టాప్ స్టార్స్.. ప్రభాస్ సినిమాల్లో విలన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా సందీప్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టాక్స్ పూర్తయ్యాయి.ఈ కథకు ప్రభాస్ కూడా ఓకే చెప్పాడు.

అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు? అనే విషయంపై చాలా చర్చ నడించింది.చివరకు బాలీవుడ్ జీరో సైజ్ బ్యూటీ కరీనా కపూర్ ను విలన్ రోల్ చేయించేందుకు రెడీ అయ్యారట.

అటు దర్శకుడు ఓమ్ రౌత్ తో కలిసి ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.ఇందులో ప్రభాస్ కు విలన్ గా బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఓకే అయ్యాడట.

Telugu #salaar, Adipurush, Kareena Kapoor, Malayalam Hero Prudviraj, Prabhas, Prabhas Movei Villains, Prasanth Neel, Saif Ali Khan, Sandeep Reddy, Spirit, Top Stars-Movie

ప్రభాస్ హీరోగా చేసే ఫైట్లు, సీన్లు మామూలుగా ఉండవు.విలన్ కూడా ఆయన స్థాయికి తగ్గకుండా ఉండాలనేది ఫిల్మ్ మేకర్స్ ఆలోచన.అందుకే ప్రభాస్ సత్తాను తట్టుకునే వ్యక్తినే ఎంచుకునేందుకు సిద్ధం అవుతున్నారు.అందుకే ఆదిపురుష్ సినిమాలో విలన్ లంకేష్ క్యారెక్టర్ ను సైఫ్ పోషిస్తున్నాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ విలన్ గా ఎంపిక అయ్యాడు.ఆయనకున్న క్రేజ్ తో పాటు ప్రభాస్ కు సూటయ్యేలా ఉంటాడు.

అందుకే ప్రశాంత్ నీల్ విలన్ గా ఆయనను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

#Prabhas #Adipurush #Salaar #Sandeep Reddy #PrabhasMovei

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube