విక్రమ్ వేదలో కొట్టుకోబోతున్న రామ్ చరణ్-రానా  

Vikram Vedha Remake with Rana And Ram Charan - Telugu Kollywood, Rana And Ram Charan, Tollywood, Vikram Vedha Remake

తమిళంలో రెండేళ్ళ క్రితం మాధవన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన సినిమా విక్రమ్ వేద.ఈ సినిమా తమిళంలో కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టింది.

Vikram Vedha Remake With Rana And Ram Charan

దీంతో అప్పట్లో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేశాడు.మళ్ళీ కారణాలు ఏంటి అనేది తెలియదు కాని దానిని పక్కన పెట్టాడు.

అయితే ఊహించని విధంగా ఇప్పుడు మరల ఆ సినిమా తెరపైకి వచ్చింది.దానిని భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కించాలని సురేష్ బాబు చూస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇందులో మాధవన్ పాత్రలో రామ్ చరణ్, విజయ్ సేతుపతి పాత్ర కోసం రానాని తీసుకోవాలని చూస్తున్నట్లు బోగట్టా.

అన్ని అనుకూలంగా జరిగితే ఈ ఏడాది ఆఖర్లులో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విక్రమ్ వేదాని సెట్స్ పైకి తీసుకెళ్లదానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాకి దర్శకుడుగా సురేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

మరి ఇది ఎంత వరకు వాస్తవ రూపం దాల్చుతుంది అనేది తెలియాలంటే అఫీషియల్ లో ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vikram Vedha Remake With Rana And Ram Charan Related Telugu News,Photos/Pics,Images..