పవర్ స్టార్, రవితేజ కాంబోలో మల్టీ స్టారర్ పై చర్చ  

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. స్టార్ హీరోలు సైతం ఇమేజ్ ని పక్కన పెట్టి మల్టీ స్టారర్ కథలు చేయడానికి ముందుకొస్తున్నారు.

TeluguStop.com - Vikram Vedha Remake Plan With Pawan Kalyan And Ravi Teja

అలాగే ఇక ఇండస్ట్రీలో సక్సెస్ అయినా హీరోలు మరో ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా నటించడానికి ముందుకొస్తున్నారు.ఈ కారణంగా సినిమాకి అన్ని చోట్ల మార్కెట్ వస్తుంది.

అలాగే టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా కథల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.ఈ నేపధ్యంలో కాంబినేషన్స్ కచ్చితంగా చూసుకుంటున్నారు.

TeluguStop.com - పవర్ స్టార్, రవితేజ కాంబోలో మల్టీ స్టారర్ పై చర్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడుగా నటించాడు.ఇదిలా ఉంటే వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ మల్టీ స్టారర్స్ చేయడానికి ముందుకొస్తున్నారు.

అలాగే చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో ఆచార్య సినిమా వస్తుంది.ఇప్పుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో పాటు రానా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి.

కథ పెర్ఫెక్ట్ గా ఉంటే ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటాడని గోపాల గోపాల సినిమాతో ప్రూవ్ అయ్యింది.మరోసారి ఏకే ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.ఈ నేపధ్యంలో ఇప్పుడు మరో దర్శకుడు పవన్ కళ్యాణ్, రవితేజ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ కథ చేయడానికి రెడీ అవుతున్నాడు.

పవర్ స్టార్, మాస్ మహారాజ్ కాంబినేషన్ అంటే ఎనర్జీ లెవల్స్ వేరే స్థాయిలో ఉంటాయి.పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలు చేసిన కిషోర్ పార్దశాని ఇప్పుడు రవితేజ, పవన్ కళ్యాణ్ తో విక్రమ్ వేధా సినిమాని రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు.

దీనికి గతంలో ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పేరు తెరపైకి వచ్చింది.మరోసారి విక్రమ్ వేధా సినిమా పవన్, రవితేజ కాంబినేషన్ లో ఉంటుందనే టాక్ నడుస్తుంది.

#MultiStarer #Ravi Teja #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు