విక్రమ్ వేదాలో రీమేక్ ని సెట్స్ పైకి ఎక్కిస్తున్న వెంకి!

విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత గురు, ఎఫ్ 2 లతో వరుసగా రెండు సక్సెస్ లని తన ఖాతాలో వేసుకొని మంచి జోష్ మీద ఉన్నాడు.దీంతో తాజాగ వరుస మల్టీ స్టారర్ సినిమాలకి వెంకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

 Vikram Veda Movie Remake In Telugu With Venkatesh And Nara Rohith Combination-TeluguStop.com

ప్రస్తుతం మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకి మామ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకటేష్ తరువాత తమిళ సూపర్ హిట్ చిత్రం అయిన విక్రమ్ వేదా సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నడని తెలుస్తుంది.ఇక ఈ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది అని సమాచారం.

వెంకటేష్ – వివి వినాయక్ కలయికలో లక్ష్మి లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా విక్రమ్ వేదా రీమేక్ అవుతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తమిళంలో మాధవన్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ ఈ రీమేక్ లో కనిపించనుండగా, విజయ్ సేతుపతి చేసిన విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నారా రోహిత్ నటించబోతున్నాడు అని సమాచారం.

కెరియర్ లో ఎక్కువగా ప్రయోగాలు చేసి దెబ్బ తిన్న నారా రోహిత్ ఈ సినిమాతో తన సత్తా చూపించాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే వరుస ఫ్లాప్ లతో ఉన్న వివి వినాయక్ లాంటి దర్శకుడుని ఈ సినిమాకి దర్శకుడుగా ఫైనల్ చేసుకోవడం తప్పని కొందరు అంటున్న.

అతని మేకింగ్ విజన్ కి ఎప్పుడు తిరుగులేదని మరికొందరు వాదిస్తారు.మరి విక్రమ్ వేదా తెలుగు సినిమా ఎ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube