ఈసారి విక్రమ్‌ మొదలు పెట్టాడు.. బాలీవుడ్‌ స్టార్స్‌ కుళ్లుకుంటున్నారు  

ఒకప్పుడు బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ చిత్రాలు వచ్చేవి, సౌత్‌ సినీ ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్‌ చిత్రాలు వచ్చేవి. బాలీవుడ్‌లో 75 కోట్ల బడ్జెట్‌తో మూవీ వచ్చిందంటే తెలుగు నిర్మాతలు మరియు మేకర్స్‌ ఆహా ఓహో అనుకునేవారు. అప్పట్లో తెలుగు మరియు తమిళంలో 20 నుండి 30 కోట్ల బడ్జెట్‌ అంటే భారీ బడ్జెట్‌. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ భారీ బడ్జెట్‌ చిత్రాలు చేస్తుంటే బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా ముక్కున వేలేసుకుని చూస్తున్నారు.

Vikram Starts Most Prestigious Movie Mahaveer Karna-Hero Mahaveer Karna South Movies

Vikram Starts Most Prestigious Movie Mahaveer Karna

తెలుగులో బాహుబలి చిత్రంతో భారీ చిత్రాల సందడి మొదలైంది. తాజాగా శంకర్‌ 2.ఓ చిత్రంతో కూడా సౌత్‌ సత్తా చాటాడు. బాలీవుడ్‌లో అత్యంత భారీ చిత్రం అంటే థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌. ఆ చిత్రం 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అప్పటికే బాలీవుడ్‌ మేకర్స్‌ ఆహా ఓహో అన్నారు. కాని థగ్స్‌ బడ్జెట్‌ కంటే 2.ఓ బడ్జెట్‌ ఎక్కువ. బాహుబలి సినిమా బడ్జెట్‌ కూడా అత్యధికం. సౌత్‌లో భారీ బడ్జెట్‌ చిత్రాలకు మంచి ఆధరణ ఉంది. కాని బాలీవుడ్‌లో మాత్రం భారీ సినిమాలను అక్కడ
పట్టించుకోవడం లేదు.

Vikram Starts Most Prestigious Movie Mahaveer Karna-Hero Mahaveer Karna South Movies

ఇప్పటి వరకు బాలీవుడ్‌ లో 200 కోట్లు కాస్త అటు ఇటుగా ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు కనీసం 100 కోట్లు కూడా రాబట్టలేక పోయాయి. అంటే అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాలన్నట మాట. కాని సౌత్‌లో మాత్రం బాలీవుడ్‌ సినిమాలు కూడా అందుకోని రికార్డులు నమోదు అవుతున్నాయి. తాజాగా సౌత్‌లో మరో భారీ బడ్జెట్‌ చిత్రం వస్తుంది. దాదాపు 310 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని పట్టాలెక్కించేందుకు తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ సిద్దం అయ్యాడు. మహావీర్‌ కర్ణ అంటూ ఈ చిత్రంకు టైటిల్‌ను కూడా ఖరారు చేయడం జరిగింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను తాజాగా ప్రారంభించారు. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా ఈ చిత్రంను భారీగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సౌత్‌లో వరుసగా భారీ బడ్జెట్‌ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్‌ మేకర్స్‌ ఆశ్చర్యంను వ్యక్తం చేసి, కుళ్లుకుంటున్నారు.