బాబోయ్.. ప్రభాస్ ను మించి మరో రాముడు.. సీత సినిమాలో విక్రమ్!

రామాయణం గురించి రాముడు గురించి ముందరికి తెలిసిందే.అటువంటి రామాయణం సినిమాలో తమ అభిమాన హీరో నటిస్తే చూడాలని ఉంది ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటూ ఉంటాడు.

 Vikram Play A Rama Role In Seetha The Incarnation, Vikram, Seetha The Incarnatio-TeluguStop.com

ఈ విషయంలో ప్రభాస్ అభిమానుల కోరిక తీరింది అని చెప్పవచ్చు.ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేశారు.అయితే టీజర్ విడుదల అయిన తర్వాత ప్రభాస్ లుక్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.

ప్రభాస్ లుక్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, అలాగే హనుమంతుడి పాత్ర లుక్స్ పై కూడా భారీగా ట్రోలింగ్స్ చేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా తెరపైకి మరొక రాముడు రాబోతున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మరొక రామాయణం దొరకబోతుందట.ఆ సినిమా పేరే సీత: ది ఇంకార్నెషన్.ఈ సినిమా లోకంగాగా సీత పాత్రలో నటించనుంది.అలాగే ఈ సినిమాకు అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకూ ఫేమస్ రచయిత అయిన విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు.

Telugu Bollywood, Kangana, Seetha, Vikram-Movie

అయితే ఈ సినిమా గురించి ఇప్పటికే ప్రకటించి చాలా రోజులు అయినప్పటికీ ఇది ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రస్తుతం క్యాస్టింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.కాదా ఈ సినిమాలో రాముడి పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన విక్రమ్ నటించబోతున్నట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటికే విక్రమ్ ను సంప్రదించగా విక్రమ్ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.మరి ఈ వార్తలు కనుక నిజం అయితే తెరపైకి మరొక రాముడు కనిపించబోతున్నాడు అన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube