వసూళ్ల విషయంలో తగ్గేదే లే అంటున్న విక్రమ్.. ఖాతలో సరికొత్త రికార్డ్.. ?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా నటించిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3వ తేదీన విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Vikram Movie Latest Record In Collections Details, Vikram Movie, Kollywood, Latest Record, Collections, Film Industry, Vikram Movie Collections, Hero Kamal Hasan, Director Lokesh Kanakaraj, Surya, Anirudh Ravichander, Robo 2.0-TeluguStop.com

ఈ సినిమా విడుదలై దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను మించి కలెక్షన్లను రాబడుతోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

 Vikram Movie Latest Record In Collections Details, Vikram Movie, Kollywood, Latest Record, Collections, Film Industry, Vikram Movie Collections, Hero Kamal Hasan, Director Lokesh Kanakaraj, Surya, Anirudh Ravichander, Robo 2.0-వసూళ్ల విషయంలో తగ్గేదే లే అంటున్న విక్రమ్.. ఖాతలో సరికొత్త రికార్డ్.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పటివరకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమా నాలుగు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమా తర్వాత ఇలాంటి వసూళ్లను రాబట్టి నా రెండవ సినిమాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రికార్డు సృష్టించింది.

ఇలా థియేటర్లో ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన విక్రమ్ త్వరలోనే డిజిటల్ స్క్రీన్ పై విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఈ సినిమాని డిజిటల్ స్క్రీన్ పై వచ్చే నెల 8వ తేదీ నుంచి విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇక ఈ సినిమాని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషన్ల్ ఫిల్మ్స్, మహేంద్రన్ బ్యానర్లు నిర్మించాయి.ఇక ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో సందడి చేశారు.

ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కమల్ హాసన్ చిత్ర బృందానికి ఖరీదైన బహుమతులను అందించిన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube