అల్లు అర్జున్‌ను వదిలేది లేదంటున్న దర్శకుడు   Vikram Kumar Wants To Do A Movie With Allu Arjun     2018-10-26   12:08:03  IST  Ramesh P

‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలై ఆరు నెలలు దాటిపోయినా కూడా ఇంకా బన్నీ తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. ఈమద్య కాలంలో బన్నీ ఇంత గ్యాప్‌ తీసుకోవడం ఇదే అని చెప్పుకోవచ్చు. నా పేరు సూర్య చిత్రం విడుదలైన వెంటనే ముందుగా అనుకున్న ప్రకారం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఆ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో కథ మరింత బంగా ఉండాలని, ఎలాంటి ూప్స్‌ లేకుండా స్క్రీన్‌ ప్లే ఉండాలనే ఉద్దేశ్యంతో విక్రమ్‌ కుమార్‌ తీసుకు వచ్చిన కథకు పలు మార్పులు చేర్పులను అల్లు వారు సూచించడం జరిగింది. అల్లు వారి సూచన మేరకు ఇప్పటికే పలు మార్పులు చేర్పులు చేసి విక్రమ్‌ కుమార్‌ కథను సిద్దం చేశాడు.

విక్రమ్‌ కథను సిద్దం చేసే లోపు త్రివిక్రమ్‌ నుండి బన్నీకి పిలుపు వచ్చింది. విక్రమ్‌ కుమార్‌ను హోల్డ్‌లో పెట్టి బన్నీ ప్రస్తుతం ఆ సినిమాకు షిప్ట్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది. బన్నీ ఒక వైపు త్రివిక్రమ్‌తో మూవీకి సిద్దం అవుతున్నా కూడా విక్రమ్‌ కుమార్‌ మాత్రం బన్నీతోనే సినిమాకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. బన్నీ కథకు ఓకే చెప్పాడు కనుక, ఆయన చెప్పిన మార్పులు చేర్పులు చేసి, ఆ తర్వాత అయినా బన్నీతోనే సినిమా చేయాలని విక్రమ్‌ కుమార్‌ భావిస్తున్నాడట.

Vikram Kumar Wants To Do A Movie With Allu Arjun-

విభిన్న చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్న విక్రమ్‌ కుమార్‌కు ఒక వైపు తమిళంలో మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయినా కూడా బన్నీతో సినిమా చేయాలనే పట్టుదలతో విక్రమ్‌ కుమార్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. బన్నీ నుండి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే వరకు అలాగే వెయిట్‌ చేస్తాను అంటున్నాడు. బన్నీకి విక్రమ్‌తో సినిమా చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్న బన్నీ చిన్న గ్యాప్‌ తీసుకున్నాడు. త్రివిక్రమ్‌తో మూవీ తర్వాత వెంటనే విక్రమ్‌ కుమార్‌తో సినిమా చేస్తాడేమో చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.