ఐకాన్ స్టార్ కోసం కథ రెడీ చేస్తున్న ఇంటిలిజెంట్ డైరెక్టర్ ?

ప్రస్తుతం సైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ లెక్కలు మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.

 Vikram K Kumar Ready To Script For Icon Star Allu Arjun-TeluguStop.com

ఈ సినిమాలో పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

Telugu Allu Arjun, Pushpa, Sukumar, Vikram K Kumar, Vikram K Kumar Ready To Script For Icon Star Allu Arjun-Movie

ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

 Vikram K Kumar Ready To Script For Icon Star Allu Arjun-ఐకాన్ స్టార్ కోసం కథ రెడీ చేస్తున్న ఇంటిలిజెంట్ డైరెక్టర్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మిక ఈ సినిమాలో ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత బన్నీ వరస సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

Telugu Allu Arjun, Pushpa, Sukumar, Vikram K Kumar, Vikram K Kumar Ready To Script For Icon Star Allu Arjun-Movie

అయితే తాజాగా ఐకాన్ స్టార్ కోసం టాలీవుడ్ ఇంటిలిజెంట్ డైరెక్టర్ కూడా ఒక కథను రెడీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.అతనెవరో కాదు మనం, 24 లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలని తీసిన విక్రమ్ కె కుమార్.ఈయన అల్లు అర్జున్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట.అయితే ప్రస్తుతానికి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట.

మరి ఈ కాంబోలో సినిమా వస్తుందో రాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

#Sukumar #Pushpa #VikramK #Allu Arjun #Vikram K Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు