మళ్ళీ అక్కినేని కాంపౌండ్ లోకి వెళ్ళిన మనం దర్శకుడు  

Vikram K Kumar Next Movie With Akkineni Hero - Telugu Akkineni Hero, Naga Chaitanya, Telugu Cinema, Tollywood, Vikram K Kumar Next Movie

మనం సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్.అక్కినేని ఫ్యామిలీకి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం లాంటి హిట్ అందించిన ఈ దర్శకుడుకి నాగార్జున కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు.

Vikram K Kumar Next Movie With Akkineni Hero

అందుకే తన చిన్న కొడుకు అఖిల్ రెండో సినిమాని విక్రమ్ చేతిలో పెట్టారు.అయితే అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం ఈ దర్శకుడు కూడా అక్కినేని కాంపౌండ్ నుంచి బయటకి వచ్చేశాడు.

తరువాత చాలా గ్యాప్ తీసుకొని తాజాగా నానితో గ్యాంగ్ లీడర్ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అయితే ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

అయితే నెక్స్ట్ సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో ఉన్న ఈ దర్శకుడు మంచి కథని సిద్ధం చేసి రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.ఇప్పటికే ఈ కథని దిల్ రాజుకి చెప్పడంతో అతని నిర్మించడానికి రెడీ అయిపోయాడు.

అయితే కథ విన్న తర్వాత దిల్ రాజు దీనిని నాగ చైతన్యతో అయితే బెటర్ అని చెప్పడంతో పాటు రామ్ చరణ్ అంటే ఇప్పట్లో కష్టం అని తేల్చేయడంతో ఇప్పుడు చైతూ దగ్గర విక్రమ్ ఆగిపోయాడు.ఇక అక్కినేని కాంపౌండ్ కి నచ్చే దర్శకుడు కావడంతో చైతూ, నాగార్జున కూడా ఈ సినిమాకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

శేఖర్ కమ్ముల సినిమా ఫినిష్ కాగానే ఇది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test