తమిళ స్టార్ హీరో విక్రమ్ సినిమాలు అంటే చాలా విభిన్నంగా ఉంటాయి.ప్రతి సినిమాలో కూడా ఆయన గెటప్ లు చాలా విభిన్నంగా ఉంటాయి అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ఆయన కోబ్రా అనే సినిమాను చేస్తున్నాడు.తాజాగా ఆ సినిమా టీజర్ వచ్చింది.
గతంలో ఫస్ట్ లుక్ వచ్చిన సమయంలోనే వావ్ అన్నట్లుగా ప్రశంసలు దక్కించుకుంది.ఇప్పుడు కోబ్రా టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది.
సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఈ టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది.గతంలో కమల్ హాసన్ వేసుకున్నట్లుగా ఒక్క సినిమాలో లెక్క లేనన్ని గెటప్ లు విక్రమ్ ఈ సినిమాలో వేసుకున్నాడు.
ఇదో థ్రిల్లర్ సినిమా అంటూ టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ వర్క్ జరుగుతోంది.
కోబ్రా సినిమా కోసం తమిళ సినీ ఆడియన్స్ మాత్రమే కాకుండా తెలుగు సినీ ప్రేమికులు మరియు విక్రమ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వారి ఎదురు చూపులకు సమ్మర్ లో బ్రేక్ పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.ఈ సినిమా లో చాలా విభిన్నంగా విక్రమ్ కనిపించడంతో పాటు కథ విషయంలో ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా దర్శకుడు చూపిస్తున్నాడు అంటున్నారు.విక్రమ్ అన్ని గెటప్ ల ను వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.
అసలు సినిమాలో విక్రమ్ ఏంటీ అనే విషయాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.రికార్డు స్థాయి బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.
కొడుకు హీరోగా పరిచయం అయిన తర్వాత విక్రమ్ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.