స్టార్‌ హీరో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి.. ఓటీటీ రిలీజ్ వద్దంటూ రిక్వెస్ట్‌

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ నటించిన సినిమాలంటే అక్కడ విపరీతమైన క్రేజ్ అనడంలో సందేహం లేదు.ఎన్నో సినిమా లు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

 Vikram And Druv Movie Mahan Release Direct Ott Details, Vikran, Druv, Mahan, Hero Vikram, Hero Dhruv, Mahaan Movie, Director Karthik Subbaraju, Amazon Prime, Vikram Fans, Kollywood, Ott Release-TeluguStop.com

ఆయన సినిమాలంటే అభిమానులు ఇప్పటికి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి అంచనాలున్న ఈయన సినిమా లను ఓటీటీ ద్వారా విడుదల చేయడంను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఆయన సినిమా లను థియేటర్ల ద్వారా చూడాలని ఆశ పడుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.కనుక ఆయన సినిమాలు థియేటర్ల ద్వారా కాకుండా ఓటీటీ ద్వారా విడుదల అయితే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది.

 Vikram And Druv Movie Mahan Release Direct Ott Details, Vikran, Druv, Mahan, Hero Vikram, Hero Dhruv, Mahaan Movie, Director Karthik Subbaraju, Amazon Prime, Vikram Fans, Kollywood, Ott Release-స్టార్‌ హీరో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి.. ఓటీటీ రిలీజ్ వద్దంటూ రిక్వెస్ట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ విషయం తాజాగా నిరూపితం అయ్యింది.

విక్రమ్‌ మరియు ఆయన తనయుడు దృవ్‌ లు కలిసి నటించిన మహాన్‌ ను అమెజాన్ ద్వారా స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

థియేటర్ రిలీజ్ కోసం ఈ సినిమాను చేసినా కూడా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్దం చేయడం అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తుంది.ఫిబ్రవరి 10వ తారీకున మహాన్ సినిమాను అమెజాన్ ద్వారా స్ట్రీమింగ్‌ చేసేందుకు గాను ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

అయితే ఇప్పటి వరకు సినిమా థియేటర్‌ రిలీజ్ అవుతుందని ఆశ పడ్డ వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆసక్తిగా లేము అంటున్నారు.

మా అభిమాన హీరో మరియు ఆయన తనయుడు నటించిన సినిమా ను ఓటీటీ ద్వారా చూడాలని అనుకోవడం లేదు.బిగ్ స్క్రీన్‌ పై ఒక అద్బుతమైన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మహాన్ సినిమాను చూస్తామని ఆశ పడితే ఇలా జరిగింది ఏంటీ అంటూ చెప్పుకొచ్చారు.విక్రమ్ ఈ సినిమా లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరి చిత్ర యూనిట్ సభ్యులు తండ్రి కొడుకులను ఎలా చూపించబోతున్నారు అనేది చూడాలి.

Vikram And Druv Movie Mahan Release Direct Ott Details, Vikran, Druv, Mahan, Hero Vikram, Hero Dhruv, Mahaan Movie, Director Karthik Subbaraju, Amazon Prime, Vikram Fans, Kollywood, Ott Release - Telugu Amazon Prime, Druv, Dhruv, Vikram, Kollywood, Mahaan, Mahan, Ott, Vikram Fans #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube