కొడుకుతో కలిసి సినిమా చేయనున్న చియాన్ విక్రమ్  

Vikram And Dhruv Vikram Combination Sets In Kollywood - Telugu Combination Sets In Kollywood, Karthik Subbaraaju, Telugu Cinema, Tollywood, Vikram. Dhruv Vikram

విలక్షణ నటుడుగా సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి చియాన్ విక్రమ్.తెలుగు సినిమాలతోనే కెరియర్ ప్రారంభించిన విక్రమ్ తరువాత మాతృభాషలో వరుస విజయాలు అందుకొని సూపర్ సక్సెస్ తో దూసుకొచ్చాడు.

 Vikram And Dhruv Vikram Combination Sets In Kollywood

అతని కెరియర్ లో సామి, శివపుత్రుడు, అపరిచితుడు సినిమాలు ఒక మైలు రాయిగా నిలిచిపోతాయి.ఈ మూడు సినిమాలు అతనిని కమర్షియల్ స్టార్ హీరోని చేశాయి.

అయితే ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక సినిమాలు, అది కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న విక్రమ్ కి సాలిడ్ సక్సెస్ మాత్రం రావడం లేదు.ప్రతి సినిమాలో తన ప్రత్యేకత చూపిస్తున్న ఎందుకనో సినిమాలు ఆడటం లేదు.

కొడుకుతో కలిసి సినిమా చేయనున్న చియాన్ విక్రమ్-Movie-Telugu Tollywood Photo Image

అయిన కూడా విక్రమ్ తో భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం అతని చేతిలో మహావీర్ కర్ణ, పొన్నియన్ సెల్వన్ లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు, కోబ్రా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ కూడా ఉంది.

వీటిలో కోబ్రా సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు చియాన్ విక్రమ్ తన కొడుకు అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయం అయిన ధృవ్ తో కలిసి నటించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

రజినీకాంత్ పేట ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vikram And Dhruv Vikram Combination Sets In Kollywood Related Telugu News,Photos/Pics,Images..

footer-test