మహా ఇల్లాలు : నా భర్తను ఎన్ కౌంటర్ చేయడం కరెక్ట్ అంటున్న గ్యాంగ్ స్టర్ భార్య …  

Vikas Dubey, UP Gangster,Kanpur,Vikas dubey deserves this fate says his wife Richa dubey in funeral,Richa Dubey, Vikas Dubey Funeral - Telugu Kanpur, Richa Dubey, Up Gangster, Vikas Dubey, Vikas Dubey Deserves This Fate Says His Wife Richa Dubey In Funeral, Vikas Dubey Funeral

యూపీ గ్యాంగ్ స్టార్ వికాస్ దూబే ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెల్సిందే.అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో గ్యాంగ్ స్టార్ దూబే ఎన్ కౌంటర్ చోటుచేసుకోవడం తో అటు విపక్షాలు సైతం విమర్శలు గుప్పించాయి.

 Vikas Dubey Wife Richa Funeral Encounter

అయితే అతడి ఎన్ కౌంటర్ పై తాజాగా దూబే సతీమణి రిచా దూబే కీలక వ్యాఖ్యలు చేశారు.అతడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆమె తప్పు చేసిన నా భర్త కు సరైన శిక్ష పడింది అంటూ పోలీసుల చర్యను సమర్ధించారు.

గ్యాంగ్ స్టార్ వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా అక్కడకి వచ్చిన రిచా తన భర్త ఎన్ కౌంటర్ సరైన చర్య అంటూ సమర్ధించారు.

మహా ఇల్లాలు : నా భర్తను ఎన్ కౌంటర్ చేయడం కరెక్ట్ అంటున్న గ్యాంగ్ స్టర్ భార్య …-General-Telugu-Telugu Tollywood Photo Image

నా భర్త చేసిన తప్పులకి సరైన శిక్ష పడింది అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

ఆమె మాత్రమే కాకుండా వికాస్ దూబే తండ్రి రామ్ కుమార్ దూబే సైతం పోలీసుల చర్యలను సమర్ధించారు.యూపీ పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారు.నా కుమారుడు 8 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నాడు ఇది క్షమించరాని నేరం అతడికి ఈ శిక్ష సరైనదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.అతడు ఏ నాడు కుటుంబానికి బాసటగా నిలిచింది లేదు,ఇంకా వికాస్ కారణంగా పూర్వీకుల ఆస్తులు సైతం నేలమట్టమయ్యాయి.

అలాంటి వ్యక్తి కి ఈ శిక్ష సరైనదే, ఇలా చేయకపోతే రేపు మరొకరు ఇలానే ప్రవర్తిస్తారు అంటూ వ్యాఖ్యానించారు.కాన్పూర్ లో దూబే అంత్యక్రియలు నిర్వహించగా అతడి భార్య ,చిన్న కుమారుడు తో పాటు బావమరిది దినేష్ తివారి మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తుంది.

పోలీసుల సమక్షంలోనే దూబే అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తుంది.

#UP Gangster #Kanpur #Richa Dubey #Vikas Dubey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vikas Dubey Wife Richa Funeral Encounter Related Telugu News,Photos/Pics,Images..