గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్ పై రాజకీయ దుమారం,మండిపడుతున్న విపక్షాలు!

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎంకౌంటర్ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది.మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు అని అనుకున్న సమయంలో అనూహ్యంగా అతడు ఎంకౌంటర్ కు గురికావడం తో విపక్షాలు మండిపడుతున్నాయి.

‌8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబెను మధ్యప్రదేశ్ పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.అతడితో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అయితే ఈ క్రమంలో దూబే ను మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని శివ్లీకి తరలిస్తున్న క్రమంలో.

కాన్పూర్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది.ఇదే అదునుగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించడం తో పాటు కాల్పులు కూడా జరిపినట్లు అధికారులు తెలిపారు.

దీనితో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపడంతో.వికాస్ దుబే మరణించాడని పోలీసులు తెలిపారు.

అయితే పోలీసులకు లొంగిపోయిన అతడు తిరిగి ఎలా పారిపోవాలి అని అనుకుంటాడు కావాలనే వికాస్ దూబే ను ఎంకౌంటర్ చేశారు అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

వికాస్ ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సమాజ్‌వాదీ పార్టీ సహా పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

"""/"/ దూబే తో పోలీసులకు,రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నాయని ఈ కారణంగానే అతడిని ఎన్ కౌంటర్ చేశారు అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దూబే తో పాటే నిజాలు అన్ని సమాధి అయ్యాయి అంటూ పలువురు రాజకీయ నేతలు ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే చైనా-భారత సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలపై కేంద్రం పై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్న ఈ సమయంలో ఇప్పుడు వికాస్ దూబే విషయం కూడా పెద్ద చర్చకు దారి తీసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 20, శనివారం 2024