బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో బిబి3 మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ నేపధ్యంలోనే ఈ సినిమాని బోయపాటి ఆవిష్కరిస్తున్నారు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ ని మించి ఉండేలా బోయపాటి కథని సిద్ధం చేశాడు.అలాగే పవర్ ఫుల్ విలన్స్ ని కూడా బాలయ్య కోసం దించాడు.
శ్రీకాంత్ ని ఇందులో పవర్ ఫుల్ విలన్ గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది.అలాగే బాలీవుడ్ నటుడుని కూడా రంగంలోకి దించాడు.
పూర్ణ, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ఈ సారి మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.
అందులో ఒక పాత్ర అఘోరాగా ఉండబోతుందని టాక్.ఈ పాత్ర నిడివి తక్కువగానే ఉన్న చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం.
ఇదిలా ఉంటే తాజా గా ఈ సినిమా షూటింగ్ ని ఓ గ్రామంలో రైతులు అడ్డుకున్నారు.దీనికి సంబందించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వికారాబాద్ మండలం కొటాల గూడెంలో ఈ చిత్ర షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేశారు.అయితే అక్కడ షూటింగ్ జరిపేందుకు వెళ్లిన చిత్ర బృందాన్ని గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారని సమాచారం.
షూటింగ్ వలన పంటపొలాలు దెబ్బతింటాయని వారు చిత్ర బృందానికి తెలిపారు.షూటింగ్ జరిపితే పంటపొలాలు పాడవుతాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ అక్కడ ప్లాన్ చేసిన సన్నివేశాలకు మరో లోకేషన్ వెతికే పనిలో పడింది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్ నడుస్తుంది.