ఏపీలో కాల్ మనీకి బలైపోయిన దంపతులు... మంగళగిరిలో దారుణం

నాలుగేళ్ల క్రితం ఏపీలో సంచలనంగా మారిన కాల్ మనీ దందా మరోసారి పాడగా విప్పింది.అప్పట్లో కాల్ మనీ వ్యవహారం సంచలనంగా మారిన తర్వాత కూడా పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం, ఏదో నామమాత్రం కేసులు పెట్టి తరువాత కాల్ మనీ వ్యాపారులని వదిలేయడం జరిగింది.

 Vijyawada Mangalagiri Couple On Callmoney-TeluguStop.com

అయితే తరువాత ఆ వ్యవహారం పక్కకి వెళ్లిపోయింది.మీడియా కూడా ఆ వ్యవహారాన్ని పట్టించుకోవడం మానేసింది.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కాల్ మనీ వ్యాపారి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి రాజధాని ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు.ఈ ఘటన మరువక ముందే ఏపీ రాజధాని ప్రాంతమైన మంగళగిరి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారడంతో మరోసారి కాల్ మనీ రాకెట్ ని తెరమీదకి తీసుకొచ్చింది.

వడ్డీ వ్యాపారుల ఆగడాలు భరించలేక మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ పోలిశెట్టి పూర్ణచంద్రరావు అతని భార్య లక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

చనిపోయే ముందు పూర్ణచంద్రరావు దంపతులు పదిపేజీల సూసైడ్ లెటర్ లో వడ్డీ వ్యాపారులు వారిని ఎంత దారుణంగా హింసించారో స్పష్టంగా తెలుస్తుంది.కాల్ మనీ కారణంగానే తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు లేకలో రాసిపెట్టారు.

పూర్ణచంద్రరావు తాపీ మేస్త్రీ.పనుల్లేక పోవడంతో అప్పులపాలయ్యాడు.వడ్డీ వ్యాపారుల వద్ద 30 వేలు ఒకసారి 20 వేలు మరోసారి అప్పు తీసుకున్నాడు.30వేల అప్పుకు లక్షన్నర వండ్డీ, ఇరవై వేల రూపాయలకు లక్ష రూపాయలు వడ్డీ కట్టాలని కాల్ మనీ వ్యాపారి వేధింపులకి గురి చేయడంతో తమ ఇంట్లో ఆడవాళ్ళని తీసుకెళ్ళి వ్యబిచారంలో దించేస్తామని బెదిరించారు.ఓ వ్యక్తి తాను డిఎస్పీ కొడుకుని అని చెప్పి భయపెట్టినట్లు లేఖలో పేర్కొన్నారు.ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.ఈ ఘటనతో ఒక్కసారిగా కాల్ మనీ వ్యవహారం రాజధాని ప్రాంతంలో సంచలనంగా మారింది.మరి దీనిపై ఏపీ పోలీసులు, ప్రభుత్వం ఏ స్థాయిలో దృష్టి పెడుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube