ఎన్నికల బరిలో బాక్సర్ విజేందర్! కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ  

కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేస్తున్న బాక్సర్ విజేందర్ సింగ్. .

Vijender Singh Likely To Contest Polls From South Delhi As Congress .-

ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు, సినీ ప్రముఖులు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి తమ ఐడెంటిటీ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా గౌతం గంబీర్ బీజేపీ పార్టీలో చేరారు. చాలా మంది క్రీడాకారులు జాతీయ పార్టీలలో కీలక నేతలుగా చలామణి అవుతున్నారు..

ఎన్నికల బరిలో బాక్సర్ విజేందర్! కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ-Vijender Singh Likely To Contest Polls From South Delhi As Congress .

ఇదిలా ఉంటే తాజాగా ప్రస్తుతం జరగబోయే లోక్ సభ ఎన్నికలలో ఇండియన్ హెవీ వెయిట్ బక్సర్ , ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్ సౌత్ ఢిల్లీ నుంచి లోక్ సభ అభ్యర్ధిగా బరిలో నిలబడబోతున్నాడు అని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరుపున అతను లోక్ సభ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు లేకుండా ఒంటరిగానే కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతుంది.

ఇందులో భాగంగా ఇప్పటికే ఆరుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్‌ ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దక్షిణ ఢిల్లీ అభ్యర్థిగా బాక్సర్ విజేందర్ సింగ్‌ పేరును ప్రకటించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.