టిఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించిన విజయశాంతి..!!

తెలంగాణ బిజెపి నాయకురాలు విజయశాంతి టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.రాష్ట్రంలో జరిగిన లాయర్ దంపతుల హత్య అదేవిధంగా వ్యవసాయం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియా సాక్షిగా విమర్శల వర్షం కురిపించారు.

 Vijayshanthi-viral-comments-on-telangana-governament- Telangana,  Vijayshanthi ,-TeluguStop.com

ఆమె ఏమన్నారంటే అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తం అని నేటి టిఆర్ఎస్ పాలకులు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మారింది.ఎన్నికల హామీ అమలు కాలేదు సరికదా మంథని తీరుగా హత్యలు కాబడుతున్నరు.

గుర్రంపోడు లెక్క అన్యాయంపై కొట్లాడుదమంటే అరెస్టులు చేస్తున్నరు, కొట్టి కేసులు పెడుతున్నరన్న భయంతో తెలంగాణ సమాజం ఆందోళన చెందుతోంది.

ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలోని పరిస్థితులివి.

ఇక రాష్ట్రం మొత్తం మీద పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు.నిలదీసి ఏదైనా అడుగుదమంటే చట్టం తెలిసిన వకీళ్ళకే రక్షణ లేకపోయింది.

కొంతమంది రైతుల ఖాతాల నుంచి వడ్లు అమ్ముకున్న పైసల్ని కూడా ఇవ్వక లోన్ కింద జమ చేసుకున్నారు. పింఛన్, రైతు బంధు డబ్బుల్ని బాకీల కింద జమ చేసుకోవద్దని బ్యాంకులకు సర్కారు నుంచి స్పష్టంగా ఆదేశాలున్నప్పటికీ పట్టించుకునే దిక్కులేదు.

పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాల్ని 5 రోజుల్లో రెన్యువల్ చేయకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ కోర్టు ఖర్చుల్ని కూడా వారే చెల్లించాలని అన్నదాతలకు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి.ఇది చాలక బ్యాంకులో క్రాప్ లోన్ ఉందంటూ పించన్లు, రైతు బంధు కూడా అపుతున్నరు అంటూ విజయశాంతి ప్రభుత్వంపై భారీ స్థాయిలో మండిపడ్డారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube