కేసిఆర్ పై సీరియస్ కామెంట్లు చేసిన విజయశాంతి..!!

తెలంగాణ ఫైర్ బ్రాండ్ బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీరియస్ కామెంట్లు చేశారు.నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన విజయశాంతి కేసీఆర్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Vijayshanthi Serious Comments On Kcr-TeluguStop.com

దళితులపై ఆయనకీ ప్రేమలేదని మండిపడ్డారు.ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, టిఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టు విజయశాంతి తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ కుటుంబ పాలన పోవాలని అందరికీ న్యాయం జరగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.కెసిఆర్ క్యాబినెట్ కి చెందిన మంత్రులు ప్రజలనే కుక్కలు అన్న తరహాలో సంబోధిస్తున్నారని ఆరోపణలు చేశారు.

 Vijayshanthi Serious Comments On Kcr-కేసిఆర్ పై సీరియస్ కామెంట్లు చేసిన విజయశాంతి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టిఆర్ఎస్ పార్టీ నేతల వార్నింగులు తాము భయపడే ప్రసక్తి లేదని, పోరాటం విషయంలో ఎంత దూరమైనా వెళ్తాము అని విజయశాంతి తెలిపారు.ఇటువంటి అరాచక ప్రభుత్వానికి త్వరలో తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని, తప్పు చేస్తే ప్రజలే రాళ్లతో కొట్టాలని అప్పట్లో కేసీఆర్ పిలుపునిచ్చారు.

అదే పరిస్థితి త్వరలో కేసీఆర్ కి వచ్చే పరిస్థితి ఉంది అంటూ బిజెపి నాయకురాలు విజయశాంతి స్పష్టం చేశారు.

#Vijayshanthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు