విశాఖ కంటకుడు చంద్రబాబు అంటున్న విజయసాయిరెడ్డి!

దేశంలో ఎక్కడా లేనంత రాజకీయ చతురత ఆంధ్రులకు ఉందని ఒక్కప్పుడు గర్వంగా చెప్పుకునే మనం ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూసి బాధపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.దీనికి ప్రధాన కారణం ప్రస్తుత రాజకీయ పార్టీ నేతలు అవలంబిస్తున్న తీరనే చెప్పాలి.

 Vijay Sai Reddy Comments On Chandrababunaidu, Chandrababu, Vijay Sai Reddy, Amar-TeluguStop.com

రాష్ట్ర రాజధాని విషయంలో ప్రస్తుతం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.ప్రస్తుతం ఈ రభస కోర్టు మెట్లెక్కింది.

ముందిచ్చిన సిఆర్డిఏ బిల్లుపై స్టేటస్ కోను హైకోర్టు ఈ నెల 27 వరకు మళ్లీ పొడిగించింది.

ఆల్రెడీ కోర్టులో కొట్టుకుంటున్న అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒకరిపై ఒకరు యుద్ధం మొదలుపెట్టారు.

టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ ను విమర్శిస్తుంటే దానికి సమాధానంగా వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు.ఇందులో విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడిని విశాఖ కంటకుడు అని వర్ణించారు.

అంతేకాకుండా చంద్రబాబు నాయుడు వల్ల విశాఖ ఎలా నష్టపోయిందో ఓ పెద్ద లేఖ రాశారో అదేంటో ఇప్పుడు చూద్దాం.

విశాఖ కంటకుడు చంద్రబాబు part -1

బాబు కుట్రలో విశాఖ జిల్లా- అధికారంలో ఉండగా విచ్ఛిన్నం.

ప్రకృతి గీసిన చిత్రం విశాఖ జిల్లా… ఎక్కడ చూసినా పచ్చని తివాచీ పరిచినట్లు – విభిన్న సంస్కృతుల ప్రజలతో మినీ భారత్ ను తలపిస్తుంది వైజాగ్.అందుకే ప్రతిపక్షంలో ఉన్నా- అధికారంలో ఉన్నా విశాఖ జిల్లా అభివృద్ధికోసమే తపించే నాయకుడు జగన్ గారు.

స్టీల్ ప్లాంట్ ను కాపాడటం నుంచి జనం దాహర్తిని తీర్చడం వరకు జిల్లాకు వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివి.అధికారంలోనున్నప్పుడు సముద్రాన్ని కంట్రోల్ చేస్తా, ప్రకృతిని శాసిస్తానంటూ సొల్లు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసిన బాబు… ఇప్పుడు విపక్షంలో చేసేదిలేక అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలా అని ప్లాన్స్ వేస్తున్నాడు.

కేవలం గ్రాఫిక్స్ తో మాయచేశాడు… పెట్టుబడులు సదస్సులు పెట్టాం 40లక్షల కోట్లు వచ్చేస్తాయన్నాడు చంద్రబాబు- తీరాచూస్తే సదస్సు పెట్టడానికైన ఖర్చులో సగంకూడా పెట్టుబడులు రాలేదు.సదస్సులో పెట్టిన శనగపప్పు, జీడిపప్పు ఖర్చులంటూ వందల కోట్లు కొల్లగొట్టిన చరిత్ర ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీది.

జగన్ గారు అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగరాభివృద్ధికోసం 13 వందల కోట్లు కేటాయించారు.ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్ భూములపై కన్నేసినట్లే… తర్వాత అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చాడు.

అందుకే రాష్ట్రాభివృద్ధిలో కొంత విశాఖకు చెందాలంటే… టాట్ కుదరదంటే కుదరదంటున్నాడు బాబు.

Telugu Amaravathi, Andhra, Apsez, Chandrababu, Crda, Vijay Sai Reddy, Vizag Indu

విశాఖలో ప్రైవేట్ యూనివర్సిటీ కోసం … ప్రజా యూనివర్సిటీగా వర్ధిల్లుతున్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టను మసకబార్చాడు, దాదాపు నిర్వీర్యం చేశాడు బాబు.ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా తన వ్యక్తిని పెట్టి… ప్రైవేట్ యూనివర్సిటీ కోసం పనిచేయించాడు.ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ సహా డాటా మొత్తం ఏయూ నుంచి అక్కడకి వెళ్లిపోయేది.ఆంధ్ర ప్రదేశ్ లోనే తొలి విశ్వవిద్యాలయంగా ఖ్యాతినార్జించిన ఏయూను భ్రష్టుపట్టించేందుకు ప్రయత్నించాడు బాబు.

14 ఏళ్లు సీఎంగా చేసినప్పుడు చంద్రబాబు ఎప్పుడూ విశాఖను పట్టించుకున్న పాపాన పోలేదు.ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా అంటూ చెప్పుకోవడం తప్ప చేసింది ఒక్కటంటే ఒక్క మంచి పనీ లేదు.రాష్ట్రం విడిపోయిన తర్వాతైనా పట్టించుకున్నాడా అంటే అదీలేదు.అభివృద్ధిని కాగితాలకు, ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగ్ లకే పరిమితం చేశాడు.

విశాఖకు పాలనా రాజధాని అవసరమే లేదంటూ అడ్డం పొడవు వాదనలతో వచ్చిన సువర్ణావకాశాన్ని దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు.

అందుకే విశాఖలో పర్యటించేందుకు వచ్చిన ఆయన… ఎయిర్ పోర్టు రోడ్డు దాటలేకపోయాడు.ఎనిమిది గంటలపాటు ప్రయత్నించినా అతని కాన్వాయ్ అంగుళంకూడా కదల్లేదు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ కేంద్రానికి లేఖలు రాసిన ఘనుడు చంద్రబాబు… అంతేకాదు హోదాకోసం ఎవరైనా మాట్లాడితే జైల్లో పెడతానంటూ బెదిరించడంతో… రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖ అభివృద్ధి కుంటుపడింది.

Telugu Amaravathi, Andhra, Apsez, Chandrababu, Crda, Vijay Sai Reddy, Vizag Indu

హైదరాబాద్ లోనేకాదు విశాఖకు ఐటీ కారిడార్ అవసరమని భావించి… ఐటీ ఇండస్ట్రీని తెచ్చింది వైఎస్ఆర్.

వైఎస్ఆర్ అధికారంలోనున్నప్పుడు 18 వేలమంది విశాఖలోని ఐటీ ఇండస్ట్రీలో పనిచేసేవారు.దివంగత నేత దివికేగాక ఆయన మెట్రో రైలు కలను చంద్రబాబు చిదిమేశాడు.

14 ఏళ్లు అధికారంలోనున్న చంద్రబాబు విశాఖకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడలేదు.నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చింది వైఎస్ఆర్.

ఆయన మరణం తర్వాత ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారయ్యింది.

నగరంలో ర్యాపిడ్ ట్రాన్స్ పోర్టు సిస్టం కోసం రెండు బీఆర్టీఎస్ రోడ్లకు వైఎస్ఆర్ 450 కోట్లు నిధులిచ్చి… నగరంపై తన మక్కువ చాటుకున్నాడు.

కేంద్రం ఓకే చెప్పిన విశాఖ మెట్రో రైల్ కారిడార్ ను ఎలా తరలించాలా అని కుట్రలు చేసిన ఘనత చంద్రబాబుది.

కంచరపాలం నుంచి పెందుర్తివరకు ఆరులైన్ల రోడ్డు వేయించింది వైఎస్ఆర్.

చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్క రోడ్డు వేసింది లేదు… విశాఖ నగరంలో ఒక్క కాలనీ కట్టించింది లేదు.వైఎస్ఆర్ హయాంలో 14 కొత్త కాలనీలు విశాఖలో ఏర్పడ్డాయన్న విషయాన్ని ప్రజలెవరూ మరచిపోరు.

విశాఖ నగరమనగానే స్టీల్ ప్లాంట్ గుర్తుకొస్తుంది.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గతంలో నినదించింది తెలుగుజాతి.

స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది … ప్రైవేట్ పరం చేస్తామని అప్పటి కేంద్రం తలపెట్టగా ఎదురొడ్డి పోరాడి… స్టీల్ ప్లాంట్ ను నిలిపారు వైఎస్ఆర్.

బ్రాండిక్స్ – APSEZలో ఉద్యోగాలు వైఎస్ఆర్ చలువే తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు.

ఎంతసేపు హైదరాబాద్ చుట్టూ – అదీ తమవారు భూములు కొన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతమయ్యేలా చూశాడు చంద్రబాబు.

వర్షం వస్తే అసలు విశాఖ ఎయిర్ పోర్టుకు విమానాలు వస్తాయా అనుకునే రోజుల్లో… ఒక టెర్మినల్ నిర్మించి అభివృద్ధి పరిచిన మహానీయుడు వైఎస్ఆర్.

హుద్ హుద్ తుపాను పేరు చెప్పి … నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి… సహాయచర్యల్లో కమీషన్లు నొక్కేసిన ఘనత చంద్రబాబుది.

విశాఖలో భూములు దోచుకుని బినామీలకివ్వడం – హుద్ హుద్ పేరు చెప్పి రికార్డులు మాయచేయడంలో ఆరితేరాడు చంద్రబాబు.

విశాఖ జిల్లాలోని అపార ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడానికి చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు.అడ్డువచ్చినవారిని మావోయిస్టనో, రౌడీ షీటరనో ముద్రవేసి ఖతం చేయడానికీ వెనుకాడేవాడు కాదు.

విశాఖ పోర్టును సైతం ప్రైవేట్ పరం చేస్తూ … తమవారికి కాంట్రాక్టులు కట్టబెట్టాడు చంద్రబాబు.ఎయిర్ పోర్టుల్లోనూ తమవారినే కాంట్రాక్టర్లుగా పెట్టాడు.చివరికి షాపులు, క్యాంటీన్లను కూడా అప్పగించాడు.ఇలాంటి ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వ్యక్తే … జగన్ గారి పై ఎయిర్ పోర్టులో హత్యాయత్నం చేశాడు.

అధికారంలో ఉన్నప్పుడు అంతన్నాడింతన్నాడు… బాహుబలి స్టైల్ లో గ్రాఫిక్స్ చూపించాడు కానీ ఏమీ చేయలేదు.ఇప్పుడు విశాఖ జిల్లాపై విషం కక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు.

వైజాగ్ కంఠకుడుగా మిగిలిపోయాడు.జిల్లాలో కొండలు, గుట్టలు, ఇసుక, ప్రైవేట్ ఆస్తులు… ఏవీ తన కబ్జాకు అడ్డుకాదన్నట్లు వ్యవహరించాడు… (సశేషం).

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube