టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన విజయసాయి రెడ్డి  

Vijaysai Reddy Tell To Babu Vacate The Lingamaneni Estate-vacate The Lingamaneni Estate,vijaysai Reddy,y.s.rajasheker Reddy,టీడీపీ అధినేత చంద్రబాబు,ప్రజావేదిక కూల్చివేత

పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా నది ఒడ్డున కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అది అక్రమ కట్టడం అని,దానిని కూల్చివేయాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..

టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన విజయసాయి రెడ్డి -Vijaysai Reddy Tell To Babu Vacate The Lingamaneni Estate

అయితే ఇక ఇప్పుడు చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూడా అక్రమ కట్టడమే అని దానిని కూడా కూల్చివేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో ఆ ఇల్లు వైఎస్ హయాంలోనే కట్టారంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై విజయ సాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మూర్ఖపు లాజిక్ లు చెప్పొద్దూ అంటూ ఆ ఇల్లు నది గర్భంలో నిర్మించిన భవనం అని తేలిన తరువాత కూల్చివేయడం తప్ప మరే పరిష్కారం లేదని వ్యాఖ్యానించారు.

మరోపక్క ప్రజావేదిక నిర్మాణం పై విజయసాయి రెడ్డి టీడీపీ కి చురకలు అంటించారు. ఈ ప్రజావేదిక నిర్మాణం లో సిమెంట్ కన్నా సినిమా సెట్టింగులను వాడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నే ఎక్కువగా వాడినట్లు తెలుస్తుంది.

కేవలం కోటి రూపాయలతో ముగించాల్సి న ఈ భవనానికి 8 కోట్లు ఖర్చు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారు అంటూ ఆరోపించారు. ప్రజావేదిక తో మొదలైన ఈ అక్రమ కట్టడం కూల్చివేత తరువాత చంద్రబాబు నివాసమే అన్నట్లు ఏపీ సీఎం జగన్ సూచన ప్రాయంగా తెలిపారు.

దీనితో ఇప్పుడు బాబు మరిన్ని కష్టాల్లో పడినట్లు అయ్యింది. అందుకే వీలైనంత తొందరగా ఆ ఇంటిని ఖాళీ చేసి విజయవాడ, అమరావతి ల లో మకాం మార్చేందుకు బాబు అన్వేషణ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఖాళీ చేయమనేవరకు వేచి ఉండకుండా,తానే హుందాగా ఖాళీ చేయాలి అన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.