స్థానిక పోరుపై సాయన్న మాట

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాడు.ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

 Vijaysai Reddy Give The Clarity About Local Body Elections, Chandrababu, Mp Ayod-TeluguStop.com

ఆ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అయ్యాడు.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టం చేశాడు.

జులై 8న ఉత్తరాంద్రలో వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తాం అన్నాడు.టీడీపీ అధినేత చంద్రబాబు కుల, మత రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించాడు.

వైసీపీ చేస్తున్న అభివృద్దిని చూడలేక చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దేవాలయాలపై దాడులు చేయిస్తున్నాడు.ఆ దాడులను వైసీపీ ప్రభుత్వం చేయిస్తుందని అసత్య ప్రచారం చేయిస్తున్నాడని అన్నాడు.

పార్టీ ఓటమిని చంద్రబాబు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాడని అన్నాడు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అర్హత ఉన్న ప్రతి పార్టీకి స్థలం కేటాయించాలని నిర్ణయించింది.

ఆ నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న ప్రతి పార్టీకి కేంద్ర కార్యలయం కోసం 4 ఎకరాలు, జిల్లా కార్యలయం కోసం రెండు ఎకరాలు స్థలం కేటాయించనున్నాం.ఆ పనులు అన్నీ పూర్తి అయ్యాక 13 జిల్లాలో వైసీపీ పార్టీ కార్యాలయంలను ఏర్పాటు చెయ్యనున్నాం.

ఆ నిర్మాణ బాధ్యతలను ఎం‌పి అయోధ్య రామిరెడ్డికి అప్పగించాం అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube